HD Photo Feature Added To Whatsapp: ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్‌తో వినియోగదారులకు సరికొత్త ఎక్స్‌పిరీయన్స్‌ను అందిస్తోంది వాట్సాప్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. మెసేజ్‌లతో పాటు ఆడియో, వీడియో కాలింగ్, ఫొటోలు, వీడియో, డాక్యుమెంట్స్‌ ఫైల్స్, కంటెంట్ షేరింగ్ ఇలా అనేక రకాలు వాట్సాప్ ఉపయోగపడుతోంది. తమ వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌ను పరిచయం చేస్తోంది. గత కొన్ని నెలలుగా వాట్సాప్ ప్రియులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఫొటోలు సెండ్ చేస్తే వాటి క్వాలిటీ తగ్గిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సమస్యకు చెక్ పడనుంది. వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీతో ఫొటోలను షేర్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకు వాట్సాప్‌లో హై రిజల్యూషన్ ఉన్న ఫొటోలు పంపేటపుడు.. వాటి క్వాలిటీ తగ్గి.. సైజు కూడా తగ్గిపోయింది. కానీ ఇక నుంచి మీరు హై రిజల్యూషన్ ఫోటోలను ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త అప్‌డేట్ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా వెల్లడించారు. వినియోగదారులందరికీ హెచ్‌డీ ఫోటో ఫీచర్‌ను రిలీజ్ చేశారు. లేటెస్ట్ అప్‌డేట్‌ గురించి మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్, ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హెచ్‌డీ ఫోటో ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో వివరించారు.


ఇలా సెండ్ చేయండి..


==> వాట్సాప్‌లో హెచ్‌డీ ఫోటోలను పంపించేందుకు ముందుగా యాప్‌ను తాజా వర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకోవాలి.
==> వాట్సాప్‌లోని ఫోటో షేరింగ్ ట్యాబ్‌పై హెచ్‌డీ బటన్ కనిపిస్తుంది. 
==> మీరు ఈ హెచ్‌డీ బటన్‌పై క్లిక్ చేసిన వెంటనే.. మీకు రెండు ఆప్షన్‌లు వస్తాయి
==> ఇందులో స్టాండర్డ్ సైజ్, హెచ్‌డీ సైజ్ అనే ఆప్షన్లు ఉంటాయి. మీరు హెచ్‌డీ క్వాలిటీలో ఫోటోను పంపాలనుకుంటే.. మీరు హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంచుకోండి. 


అయితే వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీతో ఫోటోలు పంపితే.. డేటా వినియోగం ఎక్కువగా ఖర్చు అవుతుంది. హెచ్‌డీ ఫోటో ఫీచర్ కంటే ముందు.. వాట్సాప్ ఇటీవల స్క్రీన్ షేరింగ్ అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. వీడియో కాలింగ్ మాట్లాడే సమయంలో వినియోగదారులు తమ ఫోన్ స్క్రీన్‌ను కూడా షేర్ చేసుకునే అవకాశం కల్పించింది.


Also Read: Ind Vs IRE 1st T20: నేడే బుమ్రా రీఎంట్రీ.. ఐర్లాండ్‌తో తొలి టీ20.. కుర్రాళ్లు కుమ్మేస్తారా..?  


Also Read: Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి