How to Send up to 100 photos and videos on WhatsApp: వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది వాట్సాప్. తాజాగా మరో సూపర్ ఫీచర్‌తో వచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్‌తో అనేక సమస్యలకు చెక్ పెట్టనుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకసారి కేవలం 30 ఫొటోలు పంపించేందుకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఇక నుంచి ఆ లిమిట్‌ పెరగనుంది. యూజర్లు 100 కంటే ఫొటోలు, వీడియోలు ఒకేసారి షేర్ చేసుకోవచ్చని వాట్సాప్ ప్రకటించింది. అండ్రాయిడ్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ ఫీచర్ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.24.73తో అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ అప్‌డేట్ ద్వారా ఒక్క క్లిక్‌లో వంద ఫొటోలు, వీడియోలు ఒకేసారి సెండ్ చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా మరో ఫీచర్‌ను కూడా తాజా అప్‌డేట్‌లో పరిచయం చేసింది వాట్సాప్. డాక్యుమెంట్లను క్యాప్షన్‌లను యాడ్ చేసేందుకు వినియోగదారుకు అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం ఫొటోలు, వీడియోల కోసం క్యాప్షన్ రాయడానికి అనుమతి ఉంది. ఇక నుంచి డ్యాక్యుమెంట్లకు కూడా క్యాప్షన్ ఇవ్వవచ్చు. అదేవిధంగా గ్రూప్ సబ్జెక్ట్స్, డిస్క్రిప్షన్ కోసం క్యారెక్టర్ లిమిట్ కూడా పెంచింది. దీంతో గ్రూప్ గురించి పూర్తిగా వివరించేందుకు వీలు ఉంటుంది. ప్రస్తుతం లిమిట్ 25 అక్షరాలు ఉండగా.. దీనిని 512 అక్షరాలకు పెంచింది. 


ఈ కొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటాయి. త్వరలోనే iOS యూజర్లకు పరిచయం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. బిజినెస్ యూజర్లకు కోసం కూడా మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ‘కెప్ట్ మెసేజ్’ అనే ఫీచర్‌ను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లు అదృశ్యమవుతున్న మెసెజ్‌లను కొనసాగించడానికి అనుమతిస్తుంది. గతేడాది వాట్సాప్ ఫైల్ లిమిట్‌ను మునుపటి 100 ఎంబీ నుంచి 2 జీవీకి పెంచింది. అయితే ఈ ఫీచర్ iOS యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు.


ఫొటోలు, వీడియోల లిమిట్ పెంచడం యూజర్లకు గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ఒకేసారి బల్క్ ఫొటోలు, వీడియోలు సెలెక్ట్ చేసి షేర్ చేసేందుకు ఇక నుంచి వీలుంటుంది. ఒకేసారి అధిక సంఖ్యలో ఫొటోలు, వీడియోలు పంపే అవకాశం రావడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌కు బాధ్యతలు   


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి