Whatsapp New Feature: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్, గ్రూప్స్‌పై నియంత్రణకు ఇక అడ్మిన్ రివ్యూ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. యూజర్ల సేఫ్టీ, ప్రైవేసీకు ప్రాదాన్యత కల్పిస్తూ కొత్త ఫీచర్ అందిస్తోంది.
Whatsapp New Feature: సోషల్ మెస్సేజింగ్ యాప్స్‌లో ప్రపంచంలో మేజర్ వాటా కలిగిన వాట్సప్ ఆదరణ ఇంకా పెరుగుతూనే ఉంది. కాలానుగుణంగా యూజర్లకు అవసరమైన ఫీచర్లు గ్రహించి అందుబాటులో తీసుకురావడమే ఇందుకు కారణం. ఇందులో భాగమే ఈ కొత్త ఫీచర్.
వాట్సప్ త్వరలో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం వాట్సప్ గ్రూప్‌లో కీలక ఫీచర్లు జత చేస్తున్న వాట్సప్ తాజాగా గ్రూప్ నిర్వహణను మరింత సమర్ధవంతం చేసేందుకు అడ్మిన్ రివ్యూ అందించే పని ప్రారంభించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రావచ్చు. అసలు ఈ అడ్మిన్ రివ్యూ అంటే ఏమిటి, ఈ ఫీచర్ వల్ల యూజర్లకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
వాట్సప్ గ్రూప్స్‌లో ఉన్న సభ్యులు ఏ విధమైన మెస్సేజ్ అయినా పంపించే సౌలభ్యముంది. అయితే ఆ మెస్సేజ్ అసభ్యకరంగా లేదా అభ్యంతరకరంగా ఉంటే గ్రూప్‌లోని ఇతర సభ్యులకు ఇబ్బందిగా మారుతుంది. మత, కుల, పార్టీల పరమైన పోస్టులుంటే గ్రూపులోని ఇతరులకు సమస్యగా మారవచ్చు. ఈ తరహా మెస్సేజ్‌లు రిపోర్ట్ చేసి అడ్మిన్ చేత తొలగించే పరిస్థితి లేదు. అందుకే వాట్సప్ ఇప్పుడీ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. అదే అందుబాటులోకి వస్తే కొత్త ఫీచర్ చాలా ఉపయుక్తం కానుంది. గ్రూప్‌లోని పోస్టులపై అడ్మిన్‌కు నియంత్రణ అందించే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ప్రకారం ఏదైనా పోస్టు లేదా మెస్సేజ్ అసభ్యంగా లేదా అభ్యంతరకంగా ఉంటే అడ్మిన్‌కు రిపోర్ట్ చేయవచ్చు. లేదా అడ్మిన్ స్వయంగా తెలుసుకుని అనుచితమన్పిస్తే ఆ మెస్సేజ్ లేదా పోస్టుని తొలగించవచ్చు. గ్రూప్‌లోని అందరికీ ఈ మెస్సేజ్ రిమూవ్ చేయవచ్చు. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులో రానుంది.
వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్ల సేఫ్టీ, ప్రైవసీకే ప్రాధాన్యత ఇస్తుంటుంది. మెస్సేజింగ్ యాప్‌ను ఎక్కువగా బిజినెస్ పనులకే ఉపయోగిస్తున్న పరిస్తితి ఉంది. ఇప్పుడు తాజాగా అందుబాటులో రానున్న అడ్మిన్ రివ్యూ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్ ఏదైనా సమస్యాత్మక కంటెంట్ పరిష్కరించేందుకు దోహదం చేస్తుంది. ఈ కొత్త అడ్మిన్ రివ్యూ ఫీచర్ ఆప్షనల్‌గా ఉంటుంది. అడ్మిన్ కావాలంటే ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఆన్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులకు ఏదైనా ఓ నిర్దిష్ట మెస్సేజ్ గ్రూప్ అడ్మిన్‌కు రిపోర్ట్ చేయవచ్చు. గ్రూప్ ఇన్ఫోలో ఉన్న కొత్త సెక్షన్‌లోనే గ్రూప్ అడ్మిన్‌లకు రిపోర్టెడ్ మెస్సేజ్‌లు కన్పిస్తాయి.
Also read: EPFO Updates: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త, ప్రీమియం లేకుండానే 7 లక్షల వరకూ ప్రయోజనాలు, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook