Whatsapp new feature: వాట్సప్‌లో చాటింగ్ చేసేందుకు ఇక నుంచి టైపింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ సంచలనం కల్గిస్తోంది. టైప్ చేసే అవసరం లేకుండానే చాటింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఆ కొత్త ఫీచర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్ ఇప్పుడు ఆడియో చాట్స్ పేరుతో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. త్వరలో ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో అందుబాటులో రానుంది. చాచ్ హెడర్‌లో కొత్తగా వేవ్‌ఫార్మ్ జోడిస్తామని Wabetainfo తెలిపింది. వాట్సప్‌లో ఈ ఏడాది కొత్త పీచర్లు చాలావరకూ రానున్నాయి. ఈ నెలలో కూడా కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టనుంది వాట్సప్. ఇప్పుడు కొత్తగా మరో ఫీచర్ త్వరలో అందుబాటులో రానుంది. ఈ ఫీచర్ సహాయంతో చాటింగ్ శైలి మారిపోనుంది. వాట్సప్ ఇప్పుడు ఆడియో చాట్స్ ఫీచర్‌పై పనిచేస్తోంది. దీని సహాయంతో యూజర్లు ఆడియో చాట్ చేయవచ్చు.


Wabetainfo వెల్లడించిన వివరాల ప్రకారం వెవ్‌ఫార్మ్ ఐకాన్ రియల్ టైమ్ ఆడియో విజ్యువలైజేషన్ సాధ్యాసాధ్యాల్ని ప్రతిబింబిస్తుంది. కొత్త ఫీచర్ ఒక ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందనే వివరాలు ఇంకా తెలియదు. ఎందుకంటే ఈ కొత్త ఫీచర్‌పై ఇంకా పని జరుగుతోంది. విండోస్ కోసం కూడా మెటా కొత్త వాట్సప్ అప్లికేషన్ అందిస్తోంది. వాట్సప్ యూజర్లు ఇప్పుడు గరిష్టంగా 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేయవచ్చు. కనిష్టంగా 32 మందితో ఆడియో కాల్ హోస్ట్ చేయవచ్చు.


Also read: Lost your PAN card?: మీ పాన్ కార్డు పోయిందా ? ఇలా చేయండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook