ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్. కోట్లాది మంది భారతీయులకు ఇష్టమైన యాప్ ఇది. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్ కొత్తగా మరో ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యూజర్లకు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ ఫీచర్ ప్రకారం వాట్సప్ యూజర్లు చాట్, గ్రూప్ సందేశాలను పిన్ చేయవచ్చు. Webetainfo అందించిన రిపోర్ట్ ప్రకారం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరం. ఎందుకంటే యూజర్లకు ముఖ్యమైన మెస్సేజ్‌లు లేదా చాట్‌ను టాప్‌లో ఉండేలా పిన్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఏదైనా మెస్సేజ్ పిన్ చేస్తే..పాత వెర్షన్ ఉపయోగిస్తుంటే యాప్ స్టోర్‌లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. 


మరోవైపు పిన్ చేసిన మెస్సేజిలను ఆ గ్రూప్‌లోని ఆర్గనైజేషన్‌లో మెరుగుదల కన్పిస్తుంది. యూజర్లు అవసరమైన ముఖ్యమైన మెస్సేజిలను సులభంగా గుర్తించే అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు త్వరలోనే అందరికీ అప్‌డేట్ కావచ్చు.


వాట్సప్‌పై త్వరలో మరో ఫీచర్ రానుంది. దీంతో యూజర్లు కాలింగ్ షార్ట్ కట్ చేయవచ్చు. ఒకే వ్యక్తికి తరచూ ఫోన్ చేసే పరిస్థితి ఉంటే ఈ ఫీచర్ కీలకంగా ఉపయోగపడుతుంది. 


Also read: Pension news: పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్, 50 శాతం పెరగనున్న పెన్షన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook