Whatsapp New Feature: వాట్సప్‌లో కొత్త ఫీచర్, ఒకేసారి 32 మందితో వీడియో కాల్ సౌకర్యం, ఎప్పటి నుంచంటే
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ఆ వివరాలు మీ కోసం..
ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో త్వరలో సరికొత్త ఫీచర్ రానుంది. ఈ కొత్త ఫీచర్ వీడియో కాల్‌కు సంబంధించింది. వీడియో కాల్ విషయంలో వాట్సప్ యూజర్లకు సరికొత్త సౌకర్యం కలగనుంది. ఒకేసారి 32 మంది వీడియో కాల్ ద్వారా మాట్లాడుకునే వెసులుబాటును కల్పించనుంది వాట్సప్. ప్రస్తుతం వాట్సప్‌లో వీడియో కాల్ ద్వారా 8 మంది మాత్రమే చేరవచ్చు. వీడియో కాల్ చేసే వ్యక్తి కాల్ లింక్ క్రియేట్ చేసి..అందరికీ షేర్ చేయవచ్చు. కాల్ లింక్ ఉపయోగించాలటే వాట్సప్ యాప్ అప్‌డేట్ అయుండాలి.
వాట్సప్ త్వరలో వీడియో, వాయిస్ కాల్స్ ద్వారా 32 మందిని చేర్చేందుకు లింక్ పంపించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాట్సప్ 32 మందితో గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ప్రస్తుతం వాట్సప్ వీడియో కాల్ ద్వారా 8 మందికి మాత్రమే అవకాశముంది.
ఈ వారం నుంచే వాట్సప్ కాల్ లింక్ ఫీచర్ ప్రారంభిస్తున్నామని కేవలం ఒక్క క్లిక్ ద్వారా 32 మంది చేరవచ్చని..ఇది పూర్తిగా సురక్షితమైన ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాలింగ్ అని మార్గ్ జుకర్‌బర్గ్ తెలిపారు.
Also read: e Nomination Process: మీ పీఎఫ్ ఖాతా ఇ నామినేషన్ దాఖలైందా, ఇ నామినేషన్ ఎలా చేయాలి, లాభాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook