కాలం మారేకొద్దీ టెక్నాలజీ మారుతోంది. రీల్ కెమేరా నుంచి డిజిటల్ కెమేరా వచ్చింది. కంటి రిసొల్యూషన్‌ను తలదన్నే కెమేరాలు మార్కెట్‌‌లో లభ్యమౌతున్నాయి. మరి ప్రపంచంలోనే అతి పెద్ద కెమేరా ఎలా ఉంటుందో తెలుసా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెమేరా అనేది నిజంగానే ఓ అద్భుతం. జీవితంలో ఆనందాలు, విషాదం, మర్చిపోలేని ఘటనలు, చరిత్ర ఏదైనా సరే కెమేరాలో బంధించగలుగుతున్నాం. చేతిలో పట్టే బుల్లి కెమేరాల్నించి అతిపెద్ద కెమేరాలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద కెమేరా ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది, సైజ్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారా ఎప్పుడైనా..


ప్రపంచంలో అతిపెద్ద కెమేరా కాలిఫోర్నియాలోని మేన్లో పార్క్‌లో ఉన్న ఒక ల్యాబ్‌లో ఉంది. ఈ కెమేరా 2023 అంటే వచ్చే ఏడాదికి పూర్తిగా సిద్ధమౌతుందని తెలుస్తోంది. ఈ కెమేరా పరిమాణం చాలా పెద్దది. ఇదేదో చేతికి అందే కెమేరా కానేకాదు. 


ఎస్‌యూవీ కారు పరిమాణం..24 కిలోమీటర్ల క్లిక్


ఈ కెమేరా పరిమాణంలో ఎస్‌యూవీ కారు అంత ఉంటుంది. ఈ కెమేరా 3200 మెగాపిక్సెల్‌తో ఉంటుంది. ఈ కెమేరా డయామీటర్ 5 అడుగులపైనే. ఈ కెమేరాతో అర్ధరాత్రి వరకూ చంద్రుడిని, నక్షత్రాల్ని క్లిక్ చేయవచ్చు. ఈ కెమేరాతో 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్షుల రెక్కల్ని లెక్కించవచ్చు. 


Also read: Electricity Bill fraud: ఆన్‌లైన్ కరెంటు బిల్లు చెల్లిస్తున్నారా..జాగ్రత్త, ఒక్క క్లిక్‌తో ఎక్కౌంట్ ఖాళీ కావచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook