Most Powerful Features Xiaomi 14 Ultra - Xiaomi 14 Pro: ప్రముఖ చైనీస్‌ టెక్‌ కంపెనీ షియోమీ నుంచి మార్కెట్‌లోకి  మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 14 సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మొబైల్‌ను ఫిబ్రవరి 25న జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) సందర్భంగా లాంచ్‌ చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే కంపెనీ గత సంవత్సరంలోనే  Xiaomi 14, 14 ప్రో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షియోమీ కంపెనీ గ్లోబల్‌ లాంచింగ్ కోసం Xiaomi 14 అల్ట్రా అనే కొత్త వెర్షన్‌ను కూడా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Xiaomi 14 అల్ట్రా  వేరియంట్‌ ఎంతో శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి విడుదలైతే  ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో పాటు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా వంటి హై ఎండ్‌ సిరీస్‌ మొబైల్‌పై పోటీ పడే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌లో టాక్‌..దీంతో పాటు ఈ మొబైల్‌ కొత్త HyperOS యూజర్ ఇంటర్‌ఫేస్‌తో మార్కెట్‌లోకి రాబోతోందని తెలుస్తోంది. 
 
Xiaomi 14 సిరీస్ ధర వివరాలు:
లీక్‌ అయిన వివరాల ప్రకారం ఈ షియోమీ 14 Ultra ధర ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన 13 Ultra స్మార్ట్‌ఫోన్‌కి సమానంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఐరోపాలో ఈ 13 Ultra మొబైల్‌ ధర రూ. 1.3 లక్షలు ఉండగా,  12GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ సుమారు రూ. 71,600తో అంవదుబాటులో ఉంది. అయితే ఈ Xiaomi 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విడుదలైతే ధర రూ. 56,800పైనే ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 


Xiaomi 14 సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే ఈ Xiaomi 14 సిరీస్ మొబైల్స్‌ Qualcomm Snapdragon 8 Gen 3 SoCపై పని చేయనున్నాయి. దీంతో పాటు గరిష్టంగా ఈ మొబైల్‌ 12GB ర్యామ్‌, 1TB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు ఈ 14 సిరీస్ 90W వైర్డ్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,610 mAh బ్యాటరీని ప్యాకప్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పాటు ఇవి 6.36-అంగుళాల LTPO AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీమియం కెమెరాతో అందుబాటలోకి రాబోతోంది. ఈ సిరీస్‌ బ్యాక్‌ సెటప్‌లో అతి శక్తివంతమైన లైకా బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్‌తో అందుబాలోకి రాబోతోంది. ఇందులో మొదటి కెమెరా 50 మెగాపిక్సెల్ హంటర్ 900 సెన్సార్‌ కెమెరాతో రాబోతోంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5 0MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇక ఫ్రంట్‌ సెటప్‌లో ప్రీమియం లెన్స్‌ కలిగి 32 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతోంది. ఈ మొబైల్‌ బాడీ మొత్తం టైటానియం మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter