COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi Civi 4 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ షియోమి(Xiaomi) తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మార్కెట్‌లోకి బడ్జెట్‌లో CIVI 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌ను కంపెనీ తమ మహిళ కస్టమర్స్‌ కోసం లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇది ఆకర్శనీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్ప్రింగ్ ఫీల్డ్ గ్రీన్, సాఫ్ట్ మిస్ట్ పింక్, బ్రీజ్ బ్లూ, బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అయితే ఈ CIVI 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


షియోమి సివి 4 ప్రో ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ షియోమి సివి 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని డిస్ప్లే వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన 6.67" AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. అలాగే ఈ స్క్రీన్‌ HDR10+ సపోర్ట్, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 500 nits టైపికల్ బ్రైట్‌నెస్, 900 nits పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇక షియోమి సివి 4 ప్రో మొబైల్‌ కెమెరా విషయానికొస్తే, ఇది 50MP మెయిన్ కెమెరా (Sony IMX766 సెన్సార్)తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా చాలా పవర్‌ ఫుల్‌ 800 ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. 


ఇక ఈ షియోమి సివి 4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ పెర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే, ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌తో లభిస్తోంది. కంపెనీ దీనిని రెండు ఇంటర్నల్‌ స్టోరేజ్‌ (128GB/256GB స్టోరేజ్) ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు 8GB ర్యామ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. దీంతో పాటు MIUI 13 కస్టమ్ UIతో అందుబాటులోకి వచ్చింది. ఇక మొబైల్‌ బ్యాటరీ వివరాల్లోకి వెళితే, 4500mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది 50W వైర్‌లెస్ చార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. 


ధర, ఇతర వివరాలు:
షియోమి సివి 4 ప్రో (Xiaomi CIVI 4 Pro) స్మార్ట్‌ఫోన్‌ మార్చి 21న 15:30కు మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. దీని విక్రయాలను కంపెనీ మొదట ఏప్రిల్ 1వ తేదిన ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే..12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ధర 2999 యువాన్స్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 36,999 ధరతో అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం చైనాలో మాత్రమే లాంచ్‌ చేసింది. త్వరలోనే గ్లోబల్ లాంచింగ్‌ చేయ్యబోతున్నట్లు తెలిపింది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
Wi-Fi 6
బ్లూటూత్ 5.2
NFC
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
IR బ్లాస్టర్
హై-రెజ్ ఆడియో


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి