Xiaomi 14: డబుల్ సెల్ఫీ కెమేరాతో Xiaomi 14 Civi ఎంట్రీ ఇచ్చేసింది, ధర ఎంతంటే
Xiaomi 14: ప్రముఖ చైనా స్మార్ట్‌పోన్ కంపెనీ షియోమీ నుంచి సరికొత్త డబుల్ సెల్ఫీ కెమేరా ఫోన్ లాంచ్ అయింది. Xiaomi 14 Civi పేరుతో మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు అద్దిరిపోతున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
Xiaomi 14: షియోమీ సంస్థ సరికొత్త Xiaomi 14 Civi ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ నడుస్తోంది. కెమేరా, డిజైన్, ర్యామ్ ఇలా ఏది చూసుకున్నా ఇతర ఫోన్లతో పోలిస్తే చాలా మెరుగ్గా కన్పిస్తోంది. అందుకే మార్కెట్‌లో హల్‌చల్ సృష్టించవచ్చని అంచనా ఉంది.
Xiaomi 14 Civi 6.55 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 3000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హైపవర్ ఓఎస్ వెర్షన్‌తో పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్ ఉంది. చైనాలో లాంచ్ అయిన Xiaomi Civi 4 ప్రోకు రీబ్రాండ్ అని అంచనా. 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటుంది. ఈ ఫోన్‌లో హెచ్‌డిఆర్ 10 ప్లస్ స్క్రీన్, డోల్బీ విజన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐల్ లూప్ కూలింగ్ సిస్టమ్ ఉండటంతో ఫోన్ వేడెక్కే పరిస్థితి ఉండదు.
ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే వైఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గెలీలియో ఫీచర్లతో పనిచేస్తుంది. ఇందులో యాక్సెలెరోమీటర్, యాంబియెంట్ లైట్ సెన్సార్, ఈ కంపాస్, ప్రోగ్జిమిటీ సెన్సార్, డోల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్ డెప్త్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అన్‌లాక్ సిస్టమ్ ఉన్నాయి.
ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది కెమేరా గురించి. Xiaomi 14 Civiలో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంది. అది కూడా లై బ్రాండెడ్ 50 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం విశేషం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పనిచేసే 50 మెగాపిక్సెల్ ఫ్యూజర్ 800 ఇమేజ్ సెన్సార్, 25 ఎంఎం ఈక్వలెంట్ ఫోకల్ లెన్స్, 2 ఎక్స్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలీఫోటో కెమేరా, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం రెండు 32 మెగాపిక్సెల్ కెమేరాలు ఉండటం ప్రత్యేకత.
Xiaomi 14 Civiలో 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 42,999 రూపాయలు కాగా 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 47,999 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం క్రూయిస్ బ్లూ, మ్యాచ్ గ్రీన్, షాడో బ్లాక్ రంగుల్లో ఫ్లిప్‌కార్ట్, ఎంఐ డాట్ కామ్, ఇతర రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంది. ప్రీ బుక్ చేసుకున్నవారికి రెడ్‌మి 3 యాక్టివ్ ఉచితంంగా లభిస్తుంది. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 3000 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. ఇది కాకుండా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఎంజాయ్ చేయవచ్చు.
Also read: Best 8 Seater Car: ఎస్‌యూవీ ఎందుకు, అదే ధరకు 8 సీటర్ వచ్చేస్తోంది కదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook