COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi A3 Expected Price-Date: ప్రముఖ చైనీస్‌ కంపెనీ షియోమి (Xiaomi) స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మార్కెట్‌లో A సిరీస్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని షియోమి కంపెనీ Redmi A3 మొబైల్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా..విడుదల తేదిని మాత్రం కంపెనీ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ Redmi A3 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మైక్రో సైట్‌ను Mi.comలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇప్పటికే షియోమి (Xiaomi) కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫోటోన్‌ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఫోటోల్లో ఉన్న డిజైన్‌ని బట్టి చూస్తే ఈ మొబైల్‌ బ్యాక్‌ సెటప్‌లో రౌండ్‌ మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. దీని డిజైన్‌కి కంపెనీ Hello అని పేరు పెట్టింది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటి వరకు కొన్ని స్పెషిఫికేషన్స్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు తెలుస్తోంది. 


విడుదల తేది:
ఈ Redmi A3 స్మార్ట్ ఫోన్‌  ఫిబ్రవరి 14న మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది ప్రీమియం లుక్‌, లెదర్ టెక్చర్ బ్యాక్ ప్యానెల్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. కంపెనీ ఈ సారి విడుదల చేయబోయే ఈ ఏ సిరీస్‌ స్మార్ట్ ఫోన్‌ డిజైన్‌ చాలా ఆకర్శనీయంగా కనిపించబోతోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ బ్యాక్‌ సెట్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్‌ప్లే  విషయానికొస్తే..ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంతేకాకుండా ఓఎస్‌ పరంగా కంపెనీ పెద్ద అప్‌గ్రేడ్‌తో తీసుకు రాబోతోంది. అలాగే ఈ మొబైల్‌ 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుందని సమాచారం. బ్యాటరీ రిచార్జ్‌ కోసం USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందిస్తోంది.  


ధర వివరాలు:
ఈ Redmi A3 మొబైల్‌ను కంపెనీ మొదట 6GB ర్యామ్‌ వేరియంట్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.71 అంగుళాల డిస్ప్లేతో రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను కూడా అందిచబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక బ్యాక్‌ సెటప్‌లో కెమెరా విషయానికొస్తే  13MP రియల్ కెమెరాను కలిగి ఉంటుంది. లీక్‌ అయిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.7 వేల లోపే ఉంటుందని సమాచారం. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter