khammam Crime News:  ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో 65 వేలకే స్కూటీ ఇస్తానని ఓ వ్యక్తి నమ్మబలికాడు. సుమారు రూ. కోటి యాబై లక్షలు వసూలు చేశాడు.చివరకు ఆ డబ్బుతో పరారయ్యాడు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే...
ఖమ్మం జిల్లా మధిరలో చెరుకుమల్లి వారి వీధిలో హరే రామ హరే కృష్ణ (ఇస్కాన్) అనే స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాడు ఓ వ్యక్తి. ఆ సంస్థ పేరుతో 65 వేలకే స్కూట్ అనీ ఆఫర్ పెట్టాడు. అదే విధంగా మిక్సీలు, గ్రైండర్లు, ల్యాప్ టాప్ లు, కుట్టు మిషన్ ల పేరుతో డబ్బులు వసూలు చేశాడు. సుమారు రూ.కోటి యాభై లక్షలు కలెక్ట్ చేశాడు.


పట్టణంలో ముందుగా ప్రముఖులకు బండ్లు ఇచ్చి నమ్మ బలికి ఈ మోసానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ మోసాన్ని ముందే కొంత మంది పసిగట్టి.. బెదిరించగా వారికి  50 వేలకే స్కూటీలు ఇచ్చి మిగతా సామాన్యులు వద్ద 65,000 రూపాయలు  కట్టించినట్లు సమాచారం. సుమారు అతనికి 150 మంది బాధితులు డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల నుండి ఆ వ్యక్తి ఫోన్ స్విచాఫ్ చేసుకొని ఉన్నాడని బాధితులు అంటున్నారు. 


Also read: Viral Crime News: ఎంత మోసం.. కరోనా టెస్టులని నమ్మించి.. వృద్దురాలి భూమి రాయించేసుకున్నాడు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook