Telangana Police Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. పోలీస్ ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు నియామక మండలి తెలిపింది. వీటిలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్సై పోస్టులకు 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 3.55 లక్షల మంది అభ్యర్థులు..చాలా పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


పరీక్షా తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే చెబుతామని నియామక మండలి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 7.65 శాతం బీసీలు, 8.27 శాతం బీసీ-ఏ, 17.7 శాతం బీసీ-బీ, 0.26 శాతం బీసీ-సీ వారు ఉన్నారు. 20.97 శాతం బీసీ-డీ, 4.11 బీసీ-ఈ,22.44 శాతం ఎస్సీ,18.6 శాతం ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు వివరించారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లా నుంచి దరఖాస్తులు అందాయి. 


ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు నిలిచాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్,సిరిసిల్ల, జనగామ జిల్లా నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది ఆసక్తి చూపారు.  32.8 శాతం మంది అభ్యర్థులు ..ఇంగ్లీష్‌లో రాసేందుకు ఆప్షన్ ఎంచుకున్నారు. తెలంగాణలో 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ..అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి వరుసగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నాయి. మరో 10 వేల ఉద్యోగాలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ నుంచి భర్తీ చేస్తామని తెలిపారు.


Also read:F3 director Anil Ravipudi Fire on trollers : ట్రోలర్స్‌పై అనిల్ రావిపూడి ఫైర్


Also read:Kotamreddy Sridhar Reddy: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి గుండెపోటు..ఆస్పత్రికి తరలింపు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook