F3 director Anil Ravipudi Fire on trollers : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో కొందరు ఈ మూవీపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఎఫ్3 చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ట్రోలర్స్‌పై సీరియస్‌గా ఫైర్ అయ్యాడు.
తాను తనదైన శైలిలో సినిమాలు చేస్తూ పోతుంటానని స్పష్టంచేశాడు. ట్రోల్స్, నెగటివ్ ఫీడ్ బ్యాక్‌ను అస్సలు మనసు మీదికి తీసుకోనని అనిల్ స్పష్టం చేశాడు. ట్రోల్స్ చేసేవారికి ఓ ఆసక్తికరమైన పిట్టకథ చెప్పాడు. సెటైరికల్‌గానే చెప్పినా.. అందులో అర్థం ట్రోలర్స్‌కి చేరేలా సూటిగా విషయం చెప్పేశాడు. కొంత మందికి సంబంధించిన ఒపీనియన్‌ను అందరిపైనా రుద్దటం కరెక్ట్ కాదని కుండబద్ధలు కొట్టేశాడు.
నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్లు వెజిటేరియన్ రెస్టారెంట్‌కి వెళ్లి మీరేం తింటున్నారు, ఇదేం ఫుడ్ అసలు.. అని అడిగినట్లే ఉంటుందని.. వివరించాడు అనిల్. వెజిటేరియన్ ఆహారం రుచి ఎలా ఉంటుందో నాన్ వెజిటేరియన్స్‌కు తెలియదని... అలాంటప్పుడు నాన్ వెజ్ తినేవాళ్లు ఏదో అన్నారని వెజిటేరియన్ తినటం మానేయరని వివరించాడు అనిల్. ఎవరికి నచ్చింది వాళ్లు తిన్నట్లే.. ఎవరికి నచ్చింది వాళ్లు చూస్తారని.. కొంత మంది ట్రోల్స్ చేసినంత మాత్రాన ఫీలైపోయి అక్కడే ఆగిపోలేమని స్పష్టం చేశాడు అనిల్.
చాలా ట్రోల్స్ నా వరకు వస్తున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌లో నాపైన ఒక సెక్టర్ వర్క్ చేస్తోంది. జీవితం చాలా విలువైంది. నా జీవితంలో నా విలువైన రోజుని, ఆనందాన్ని.. వేరే వాళ్ల వల్ల స్పాయిల్ అవనివ్వనని అనిల్ స్పష్టంచేశాడు. ఒకళ్లను కించపరచటం వేరొకళ్లకి ఆనందం. కానీ నన్ను ఇష్టపడేవాళ్లు లక్షల్లో ఉండగా... విమర్శించేవాళ్ల గురించి ఆలోచిస్తే... నన్ను ప్రేమించే వాళ్లకు నా నుంచి కోరుకునేది ఇచ్చేలా నా బాధ్యత పూర్తిగా నెరవేర్చలేనని స్పష్టం చేశారు. నేను చేసే కామెడీని కోట్లాది మంది ఆదరిస్తున్నారు. కొద్ది మంది తనపై ఏదో చేయాలనిపిస్తే చేసుకోండని, తానేంటో తనకు తెలుసని, ప్రతి సినిమాకు నేర్చుకుంటూ.. మెట్లెక్కుతున్నానని.. అందరికీ నచ్చే సినిమాలు తీస్తానేమోనని.. అయితే తిట్టేవాళ్లకు ఛాయిస్ మీదే అంటూ అనిల్ ముగించేశాడు.
Also Read - Aryan Khan Case: క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో కీలక మలుపు..ఆర్యన్‌కు అందుకే ఊరట లభించిందా..?
Also Read - F3 Movie on OTT: ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కులు ఎవరికి సొంతం ? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook