Food poison: తెలంగాణలోని జనగాం జిల్లా దేవరుప్పుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కెజిబివి) దోషకాయ చట్నీ తిని సుమారు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారంలో బల్లి అవశేషాలు గుర్తించారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే చికిత్స నిమిత్తం జనగాం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబరు 26, గురువారం రాత్రి తమకు వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు వికారం, కడుపునొప్పితో బాధపడినట్లు గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. గత 2 నెలల్లో జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.  సెప్టెంబరులో వర్ధన్నపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో బల్లి పడిన ఆహారం తిని సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల పరిస్థితిని గమనించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని..ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని... మెస్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. అస్వస్థతకు  గురైన విద్యార్థులను మెరుగైన చికిత్స అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 


Also Read: Gujarat Fire Haircut: నిప్పుతో హెయిర్ కటింగ్.. అయ్యో జుట్టు మొత్తం పోయింది.. యువకుడికి తీవ్ర గాయాలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి