Fire Haircut Accident: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. డిఫరెంట్‌గా కటింగ్ చేయించుకుందామనుకున్న యువకుడికి జుట్టు మొత్తం కాలిపోయి గాయాలపాలయ్యాడు. వింత హెయిర్ స్టైల్ కోసం ప్రయత్నించి గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బార్బర్ షాప్‌లో ఫైర్‌తో హెయిర్ కట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో 18 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వల్సాద్ జిల్లా వాపి వాపిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో యువకుడి గొంతు, ఛాతీ భాగం కాలిపోయిందని వాపి పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం అతను సూరత్‌లోని ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
బాధితుడు భద్రక్‌మోరా ప్రాంతంలో నివాసి అని.. సుల్పాడ్ ప్రాంతంలో ఉన్న ఒక బార్బర్ షాప్‌కు 'ఫైర్ హ్యారీకట్' చేయించుకోవడానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి వాంగ్మూలం నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని.. బార్బర్ షాపు వ్యక్తిని కూడా విచారిస్తున్నామని చెప్పారు. బాధితుడి జుట్టుకు కొంత రసాయనాన్ని పూయగా.. దాని కారణంగా అతని శరీరం భాగాలకు మంటలు అంటుకున్నాయన్నారు. 'ఫైర్ హ్యారీకట్'కు ఏ రసాయనాన్ని ఉపయోగించారనేది నిర్ధారణ జరుగుతోందని అన్నారు.
An 18-year-old man suffered severe burn injuries after his ”fire haircut” went wrong at a salon in Vapi town of Gujarat’s Valsad district#valsad #fire_haircut #ViralVideo #viralvideos2022 pic.twitter.com/K4ALzdGyq5
— Ravi kumar (@ravikumar455) October 27, 2022
డిఫరెంట్ హెయిర్ స్టైల్ కోసం చాలా మంది యువకులు 'ఫైర్ హెయిర్ కట్'చేయించుకుంటున్నారు.ఫైర్ హెయిర్ కట్ చేయడానికి.. జుట్టు కాలడానికి ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని పూయాలి. తరువాత జాగ్రత్తగా నిప్పంటించి వెంటనే దువ్వెనతో ఆర్పుతూ హెయిర్స్ సెట్ చేయాలి. కానీ గుజరాత్‌లో జుట్టుకు అంటించే రసాయనం కాస్తా.. ముఖానికి కూడా పూయడంతో ముఖం, మెడపై కూడా మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పివేయగా.. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read: TRS MLAs Trap Case: టీఆర్ఎస్ మౌనం.. బీజేపీ దూకుడు.. సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!
Also Read: T20 World Cup: ఆశలన్నీ భారత్‌పైనే.. పాక్ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి