తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది.
హైదరాబాద్: తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా రోజూవారీగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం చూసి మురిసిపోయిన తెలంగాణ వాసులకు శనివారం కరోనా మరోసారి షాక్ ఇచ్చింది. నేడు రాష్ట్రంగా కొత్తగా 17 మందికి కరోనావైరస్ సోకినట్టు తేలింది. శనివారం నమోదైన 17 పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 ఉండగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాత్రి 9 గంటలకు ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Also read : ఏపీలో 24గంటల్లో 62 కొత్త కేసులు
ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన కారణంగా 29 మంది చనిపోయారు. కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 499 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 533 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..