TS RTC Jobs: తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీత భత్యాలు, ఎంపిక విధానం వంటి అంశాలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 300 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఎంపిక అయిన వారికి మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మించరాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18 వేలు ఇవ్వనున్నారు. రెండో ఏడాది నెలకు రూ.20 వేలు ఇస్తారు. మూడో ఏడాది నెలకు రూ.22 వేల చొప్పున జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


డిప్లొమా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16 వేలు, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19 వేల జీతాలు చెల్లించనున్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.


Also read: Supreme court: ఆర్య సమాజ్‌లో జరిగే పెళ్లిళ్లు ఇక చెల్లవు..సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!


Also read:7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..డీఏ పెంపు ఎంతంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook