Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. దాడిలో పాల్గొన్న అభ్యర్థులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఇప్పటివరకు మొత్తం 46 మంది అభ్యర్థులను రిమాండ్ కు తరలించారు. 46 మంది అభ్యర్థులకు రైల్వే కోర్టు 14 జుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను  రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించి 15 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైల్వే యాక్ట్ సెక్షన్ల కింద ఒక్కసారి కేసులు నమోదైతే మాఫీలు ఉండవని అధికారులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండలో పాల్గొన్న మిగితా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాడుల కుట్ర వెనక ఉన్న ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు  పోలీసులు. ఈ కేసులో కీలక సూత్రదారిగా భావిస్తున్న నర్సరావుపేటకు చెందిన సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించి మరో 200 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అదుపులోనికి తీసుకున్న అభ్యర్థులు ఇచ్చిన సమాచారంతో సాయి ఢిపెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును ప్రకాశం జిల్లా కంభంలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్నారు సుబ్బారావు. అల్లర్లకు సంబంధించి అతన్ని ప్రశ్నిస్తున్నారు. దాడికి ఎవరూ ప్లాన్ చేశారు.. ఎలా అమలు చేశారు.. రైల్వే స్టేషన్ నే ఎందుకు టార్గెట్ చేశారు.. కుట్రలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్ని కోణాల్లో సుబ్బారావు నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారని తెలుస్తోంది. అయితే  ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. సుబ్బారావుతో పాటు మరో పది మంది ఆర్మీ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ల ఓనర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు.


Read also: Covid Cases in India: దేశంలో 72 వేలు దాటిన యాక్టివ్ కేసులు.. కొవిడ్ ఫోర్త్ వేవ్ అలర్ట్!


Read also: KTR MEET JUPALLI: అసంతృప్త నేతలకు తాయిలాలు.. బుజ్జగింపులు! టీఆర్ఎస్ లో కొత్త సీన్... కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook