గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరుకు సంబంధించి కీలకమైన ఘట్టమంతా  ముగిసింది. అటు నామినేషన్ల స్క్రూటినీ ఇటు ఉపసంహరణ రెండూ ముగిశాయి. గ్రేటర్ బరిలో 68 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక ( GHMC Eections ) లకు సంబంధించి నామినేషన్ల ఘట్టంలోని అన్ని ప్రక్రియలు ముగిశాయి. నామినేషన్ల స్క్రూటినీతో పాటు నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ముఖ్యంగా స్క్రూటినీలో 68 నామినేషన్లు ( Nominations ) తిరస్కరణకు గురవడం విశేషం. గ్రేటర్ బరిలో మొత్తం 1893 మంది అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేయగా..1825 నామినేషన్ల సక్రమంగా ఉన్నాయని తేలింది. మిగిలిన 68 నామినేషన్లలో పొరపాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కొందరికి ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉందని తేలింది. తిరస్కరణకు గురైన నామినేషన్లలో కాంగ్రెస్ అభ్యర్ధి కూన శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఈయనకు ముగ్గురు పిల్లలున్నట్టు ఫిర్యాదు అందడంతో అధికారులు  పరిశీలన అనంతరం నామినేషన్ తిరస్కరించారు. Also read: GHMC Elections 2020: గ్రేటర్ పోరులో..టీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన ఒవైసీ