తెలంగాణలో కరోనా వైరస్ (Telangana CoronaVirus) మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. అరకొర టెస్టులు చేస్తున్నా దాదాపు శాతం మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది.  తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు పేషెంట్లతో నిండిపోయాయని, అక్కడ చేరితే ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నట్లేనని ప్రతిపక్షాలతో పాటు కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. Telangana: కరోనా పాజిటివ్ కేసులపై లేటెస్ట్ అప్‌డేట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Telangana COVID19 Beds | తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులలో 92.2 శాతం బెడ్స్(పడకలు) ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ అధికారిక వర్గాల సమాచారం. ఇప్పటివరకూ కేవలం 7.8శాతం పడకలు మాత్రమే కోవిడ్19 పేషెంట్లు వినియోగించుకున్నారట. వాస్తవానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా పేషెంట్ల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 17,081 బెడ్స్ సిద్ధం చేసింది.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


ఇందులో 11,928 ఐసోలేషన్ బెడ్స్, 3,537 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్, 1,145 ఐసీయూ బెడ్స్ కాగా మిగతా 471 బెడ్స్‌ను వెంటిలేటర్ కోసం ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం నాటికి రాష్ట్రంలో కేవలం 7.8శాతం బెడ్స్ మాత్రమే వినియోగించారు. బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలియక పేషెంట్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి కష్టాలు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం


కోవిడ్19 సీరియస్ పేషెంట్లకు మాత్రమే గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఓ మోస్తరు కరోనా లక్షణాలున్న పేషెంట్లను కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి, నల్లకుంటలోని ఫివర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. లక్షణాలు లేని కరోనా బాధితులను నేచర్ క్యూర్ హాస్పిటల్, నిజాం హాస్పిటల్, ప్రభుత్వ ఆయుద్వేద ఆసుపత్రి, ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రులలో చేర్చుకుని క్వారంటైన్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos