MRO ఆఫీసు ముందే రైతన్న ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఎమ్మార్వో, వీఆర్వో పేర్లు
Farmer Commits Suicide | తన పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుతో ఆన్‌లైన్ చేయడం లేదని ఆందోళనకు గురైన ఓ రైతన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుటే ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ఎమ్మార్వో, వీఆర్వో, మరో వ్యక్తి కారణమని సూసైడ్ నోట్ రాసి రైతు బలవన్మరణం చెందాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డికి ఎకరం 20 గుంటల భూమి ఉంది. బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్.. టాలీవుడ్‌లో ఆందోళన!
ఆ భూమిని తన పేరిట ఆన్‌లైన్ చేయాలని గత కొంతకాలం నుంచి కాల్వశ్రీరాంపూర్ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక ఎమ్మార్వో ఆఫీసు వద్దకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి మరి రైతు రాజిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. తన ఆత్మహత్యకు ఎమ్మార్వో వేణుగోపాల్, వీఆర్వో గురుముర్తి, స్వామి.. ఈ ముగ్గురు వ్యక్తులే కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఘటనాస్థలికి పోలీసులు రైతు రాజిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ