Hyderabd Crime News: హైదరాబాద్‌(Hyderabad)లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో రూ.2వేల కోసం.. ఓ వ్యక్తి స్నేహితుడనే కనికరం లేకుండా దారుణంగా గొంతుకోసి హత్య(Murder) చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్(UP)లోని వారణాసికి చెందిన సోను(27) బతుకుతెరువు కోసం ఆరేళ్ల క్రితం నగరానికి వచ్చి ముషీరాబాద్​(Musheerabad)లో స్థిరపడ్డాడు. ఆ ప్రాంతంలోనే మటన్​షాప్​లో పనిచేసే అల్తాఫ్ ఖాన్​తో సోనూ పరిచమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి ముషీరాబాద్​లో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.


Also Read: Suicide: డాక్టర్ కావాలని కలలు కన్నది...నీట్‌లో ర్యాంకు రాలేదని ఉరేసుకుంది..


ఈ క్రమంలో అల్తాఫ్‌ఖాన్‌ మూడు నెలల క్రితం సోనుకు రూ.2 వేలు అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వమని అల్తాఫ్ అడుగుతున్నప్పటికీ.. సోనూ దాటవేస్తూ వచ్చాడు. ఎప్పటిలాగే.. ఇద్దరూ కలిసి గురువారం రాత్రి మద్యం తాగారు. అప్పు విషయమై ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఈ వాదన కాస్త గొడవ(Conflict)కు దారితీసింది. మద్యం మత్తులో తీవ్ర ఆగ్రహానికి గురైన అల్తాఫ్... సోనూను కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అల్తాఫ్ ఖాన్ ముషీరాబాద్ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి లొంగి పోయినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook