'కరోనా వైరస్' వ్యాప్తిని అడ్డుకునేందుకు అవగాహన కల్పించడమే చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఎవరికి తోచిన విధంగా వారు కరోనా వైరస్ వ్యాప్తి గురించి తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా ముందుకొచ్చారు . కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.తెలంగాణలోనూ పకడ్బందీగా లాక్ డౌన్ అమలు జరుగుతోంది. పోలీసులు 24  గంటలు డ్యూటీ చేస్తూ .. ప్రజలను వైరస్ బారిన పడకుండా కాపాడుతున్నారు. కానీ కొంత మంది అక్కడక్కడ బయటకు వస్తూ పోలీసుల పనిని మరింత పెంచుతున్నారు. దీంతో వారు లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. 


కానీ రోజూ పోలీసులు కొట్టలేరు కదా..! కొట్టీ కొట్టీ వారు అలసిపోతున్నారు. ఇందుకు తెలంగాణ పోలీసులు ఓ మాంచి ఐడియా కనుగొన్నారు. తాము కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నలాల్ మదార్ ఓ పాట రాశారు. ఓరోరి నా ఫ్రెండ్.. చెప్పినట్టు దూరంగా  ఉండు..  అని సాగుతుందీ పాట. ఇప్పుడు ఈ పాటను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పాటను తెగ మెచ్చకుంటూ ట్వీట్ చేశారు. రీల్ హీరో కాదు.. రియల్ హీరో రాసిన పాట చాలా బాగుందని కితాబిచ్చారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..