12 BRS MLAS Joins Congress today Janajathara Sabha: తెలంగాణ రాజకీయల్లో సంచననం.. ఒకేసారి 12 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని, ఈరోజు తుక్కుగూడ జనజాతర సభలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ,కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా గంగుల కమలాకర్‌ను బారిలోకి దింపుతారని తెలస్తోంది. గంగులతోపాటు 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు జనజాతర సభలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: రైతుల కన్నీరు తుడిచిన కేసీఆర్‌.. రూ.25 లక్షలకు డిమాండ్‌


బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో ఇప్పటికే టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు తుక్కుగూడలో తలపెట్టిన జనజాతరలో ఈ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్‌ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లీఖార్జన ఖర్గేలతోపాటు ప్రముఖ కాంగ్రెస్‌ అధినేతలు రానున్నారు. ఈ సభలోనే 12 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సోషల్‌ మీడియాలో సైతం వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయం బీఆర్‌ఎస్‌కు మాత్రం బిగ్‌ షాక్  బీఆర్‌ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.


ఇదీ చదవండి: కేసీఆర్‌ పర్యటనలో 'దొంగల చేతివాటం'.. నాయకుల లబోదిబో


ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు ఏఐసీసీ చీఫ్‌లను కూడా కలుస్తున్నారు బీఆర్‌ఎస్‌ 12 ఎమ్మెల్యేలు అని కూడా తెలుస్తోంది.. దీంతో గతంలో జరిగిన సీన్‌ మళ్లీ రిపీట్‌ కాబోతోందా? అనిపిస్తోంది. 2018లో బీఆర్‌ఎస్‌ గెలిచిన సమయంలో దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే సీన్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి అమలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవిత తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో రిమాండ్లో ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల జంపులు కూడా బీఆర్ఎస్ పార్టీటి మాత్రం కోలుకోలేని దెబ్బేనని చెప్పుకోవచ్చు.


కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వీరేనా?


1 అరికపూడీ గాంధీ  శేరిలింగంపల్లి
2  తెల్లం వెంకట్రావ్ భద్రాచలం
3  సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్,
4 కాలేరు వెంకటేశ్  అంబర్ పేట్
5  కాలే యాదయ్య చెవెళ్ల
6 మాగంటీగోపీనాథ్ జుబ్లీహీల్స్
7  ప్రకాశ్‌ గౌడ్ రాజేంద్రనగర్
8 ముఠాగోపాల్ ముషిరాబాద్
9  మానిక్ రావ్ జహీరాబాద్
10 కోవాలక్ష్మి  అసిఫాబాద్,
11 బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్
12 గంగుల కమలాకర్ కరీంనగర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook