ప్రేమలో ఉన్నవారికి రాత్రి తెలియదు.. పగలు తెలియదు. భయం అనేది లేకుండా వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు ప్రేమ పేరుతో విశృంఖలంగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం. అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసం చేశారని అబ్బాయిలు రోడ్ల మీద తిరగడం.. తాగుడుకు బానిస అవ్వడం చూస్తూనే ఉంటాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అబ్బాయిలు మోసం చేశారని అమ్మాయిలు కూడా బాధ పడుతారు కానీ రోడ్డు ఎక్కడం మాత్రం చాలా తక్కువగా జరుగుతుంది. పోలీసులను అయినా ఆశ్రయిస్తారు కానీ రోడ్డు ఎక్కి రచ్చే చేసే వారిని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఒక అమ్మాయిని పంజాగుట్ట శ్మశానంలో హడావుడి చేసింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అర్థరాత్రి సమయంలో పంజాగుట్ట శ్మశానం లో ఒక యువతి హల్ చల్ చేసింది. యువతిని శ్మశానంలో చూసిన వారు షాక్ అయ్యారు. అర్థరాత్రి సమయంలో శ్మశానంలో యువతి ఏంటి అంటూ కొందరు భయపడ్డారు. దెయ్యం అనుకుని కొందరు దగ్గరకు వెళ్లేందుకు కూడా వణికి పోయారట. ఆ యువతి గట్టి గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేస్తున్న నేపథ్యంలో కొందరు ఆమె వద్దకు వెళ్లారు. 


విషయంను కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కొన్ని నిమిషాల్లోనే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. యువతి గట్టి గట్టిగా ఏడ్చుకుంటూ తాను చనిపోతాను అంటూ హంగామా చేసింది. పోలీసులు వచ్చిన తర్వాత కూడా యువతి చనిపోయేందుకు ప్రయత్నించింది. దాంతో ఆ యువతిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


Also Read: Yashasvi Jaiswal Big Six: యశస్వి జైస్వాల్‌ భారీ సిక్స్.. వాంఖడే స్టేడియం బయట బంతి! బిత్తరపోయిన ఆర్చర్ 


పంజాగుట్ట శ్మశానంలో దాదాపు రెండు గంటల పాటు రచ్చ చేసిన యువతిని పోలీసులు స్టేషన్‌ కు తరలించి ఆ తర్వాత విచారించారు. యువతి సంబంధీకులకు సమాచారం అందించారు. అర్థరాత్రి సమయంలో శ్మశానంకు వెళ్లడానికి కారణం ఏంటంటూ యువతిని ప్రశ్నించగా తాను ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని.. అతడు తనను వదిలేసి వెళ్లి పోయాడు. అతడు లేకుండా తాను జీవితాన్ని ఊహించుకోలేను. 


అందుకే ఆత్మహత్య చేసుకోవాలని భావించాను. ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా తాను చనిపోతాను అంటూ ఆ యువతి పోలీసుల వద్ద కూడా అన్నదట. ఆ యువతికి పోలీసులు నచ్చజెప్పి కౌన్సిలింగ్ చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అర్థరాత్రి శ్మశానంలో యువతి చేసిన హడావుడికి అంతా కూడా షాక్ అయ్యారు. రోడ్డు పై వెళ్తున్న వారు కూడా ఆ సమయంలో ఆగి మరీ శ్మశానంలో జరుగుతున్న వ్యవహారాన్ని వీక్షించేందుకు నిల్చున్నారు. దాంతో కొద్ది సమయం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని ప్రత్యక్ష సాక్ష్యులు పేర్కొన్నారు


Also Read: Divorce vs Supreme Court: ఇక విడాకులు వెంటనే ఇచ్చేయవచ్చు, నో వెయిటింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.