AAP Protest: హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన కాన్వాయ్‌ను ఆప్‌(AAP) నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను తగ్గించాలంటూ హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ఆప్‌ నేతలు,కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెంటనే నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో కలెక్టరేట్‌లో కార్యక్రమం ముగించుకుని బయటకు వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ..ఆప్‌ నేతలు, కార్యకర్తలను నిలవరించారు. దీనికి పోటీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత నెలకొంది.


పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలో పుంజుకోవాలని భావిస్తున్న ఆమ్‌ ఆద్మీ..ఆ దిశగా వెళ్తోంది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కలెక్టరేట్లకు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్తోంది. త్వరలో తెలంగాణలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది.


కేజ్రీవాల్ పాదయాత్రకు నేతలు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ఉత్తరాధిలో క్రమేపి ఆప్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా దక్షిణాదిపై ఆప్‌ పార్టీ ఫోకస్‌ చేసింది. తెలంగాణలో టీజేఎస్‌సైతం ఆ పార్టీలో విలీనం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్..ముఖ్య నేతలతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.


Also read: Weight Loss Tips: ఈ చిట్కా వాడితే కొద్దిరోజుల్లోనే బరువు ఇట్టే తగ్గిపోతారు!


Also read:Sanju Samson: ఫైనల్లో ఓడినందుకు బాదేంలేదు.. జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సంజూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook