TS Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..హెచ్‌ఆర్‌ఏ పెంపు..!

TS Govt: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ(HRA) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Written by - Alla Swamy | Last Updated : May 28, 2022, 06:06 PM IST
  • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు
  • ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
TS Govt: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..హెచ్‌ఆర్‌ఏ పెంపు..!

TS Govt: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ(HRA) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ(HRA)లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న శంషాబాద్‌, జల్‌పల్లి, శామీర్‌పేట ప్రాంత ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంచింది. జీహెచ్‌ఎంసీ(GHMC) నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోని ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. హెచ్‌ఆర్‌ఏ పెంచడం వల్ల తమకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హెచ్‌ఆర్‌ఏ పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నామని..ఇప్పటికి తమ ఆకాంక్ష నెరవేరిందంటున్నారు. ఎప్పటికప్పుడు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. 

 

Also read:Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలో మహేంద్ర సింగ్ ధోనీ?

Also read:Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News