TS News: రూ.30 వేల లంచానికి కక్కుర్తిపడి.. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌(ఏడీఈ) ఏసీబీకు చిక్కాడు. ఈ ఘటన శుక్రవారం హైదరాబాద్(Hyderabad)లో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిశా డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..
ఇబ్రహీంబాగ్‌ విద్యుత్‌ సబ్‌డివిజన్‌లో చరణ్‌సింగ్‌ ఏడీఈ(ADE)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి రూ. 2లక్షలు జీతం. ఇతడు మొయినాబాద్‌, శంకర్‌పల్లి, నార్సింగ్‌, ఇబ్రహీంబాగ్‌ డివిజన్లలో జరిగే పనులను పర్యవేక్షిస్తాడు. మణికొండకు చెందిన గుత్తేదారు రవి కొన్నేళ్లుగా ఆ శాఖలో చిన్నచిన్న పనులు చేస్తున్నారు. మణికొండలో విద్యుత్తు తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం సహా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చే పనుల టెండరు(Tender)ను ఇటీవల దక్కించుకున్నారు. అందుకు అవసరమైన అనుమతి పత్రం కోసం ఏడీఈ వద్దకు వచ్చాడు.


Also Read: Mahbubnagar: రెండు వారాల్లో పెళ్లి...అంతలోనే యువతిపై లైంగిక దాడి..


ఏడీఈ లంచం (Bribe)కోరడంతో..అతడు అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం మధ్యాహ్నం  గుత్తేదారు రూ.30వేలతో ఏడీఈ కార్యాలయానికి వెళ్లారు. లంచం సొమ్మును చరణ్‌సింగ్‌ తీసుకుంటుండగా అనిశా(ACB) అధికారులు పట్టుకున్నారు. ‘విచారణ అనంతరం ఆయన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించామని, ఆయన ఇల్లు, కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగిస్తున్నామని’ రంగారెడ్డి జిల్లా అనిశా డీఎస్పీ సూర్యనారాయణRangareddy District ACB DSP Suryanarayana) వివరించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook