Mahbubnagar: రెండు వారాల్లో పెళ్లి...అంతలోనే యువతిపై లైంగిక దాడి..

రెండు వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం తాగించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో జరిగింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 12:04 PM IST
Mahbubnagar: రెండు వారాల్లో పెళ్లి...అంతలోనే యువతిపై లైంగిక దాడి..

young woman rape in Mahbubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లా(Mahbubnagar District)లో దారుణం చోటుచేసుకుంది. రెండు వారాల్లో పెళ్లి కావాల్సిన యువతికి పని ఇప్పిస్తామని తీసుకెళ్లి..మద్యం తాగించి అత్యాచారం(Rape) చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... కోయిలకొండ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన రాజేందర్‌రెడ్డి అలియాస్‌ రాజు (35), మహబూబ్‌నగర్‌ మండలం కోటకదిర గ్రామానికి చెందిన ఆంజనేయులు (27) పెయింటర్లు(painters raped a woman)గా పని చేస్తున్నారు. ఆ యువకులిద్దరు వివాహితులే.

వీరిద్దరూ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతానికి వచ్చి అడ్డాలో నిలబడి పని దొరికిన చోటుకు వెళ్తుంటారు. ఈ నెల 5న అదే అడ్డాలో ఓ యువతి (21)కి పని ఇస్తామని, తమవెంట రమ్మని బలవంతపెట్టారు. బైక్ ఎక్కించుకుని.. పట్టణ శివారులోని ఫతేపూర్‌ మైసమ్మ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ యువతికి మద్యం తాగించి అత్యాచారానికి(young woman rape in Mahbubnagar) ఒడిగట్టారు. ఆ దృశ్యాలను చరవాణి(Phone)లో బంధించి...ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

Also Read: Man harassed Woman: సీఐడీ ఆఫీసర్‌‌ని.. నాకు నువ్వుకావాలంటూ మహిళకు వేధింపులు

ఆ యువతికి ఈ నెల 18న  వివాహం(Marriage). దాంతో ఆ పెళ్లిని చెడగొట్టాలని భావించిన వారు...ఫోన్ లో చిత్రీకరించిన చిత్రాలను ఈనెల 10న ఆ యువతికి కాబోయే భర్తకు వాట్సాప్‌(rape video in WhatsApp) ద్వారా పంపించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజున యువతి కుటుంబ సభ్యులు పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం టీడీగుట్ట అడ్డా వద్ద ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News