Anirudh Reddy: తమ సిఫారసు లేఖలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తిరుమల ఆలయంపై మరోసారి తెలంగాణ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం అక్కడే సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన రెండు రోజుల తర్వాత మరోసారి అదే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. తిరుమలలో తెలంగాణకు విలువ లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. తిరుమలలో సిఫారసు లేఖలు ఆమోదం తెలపకపోతే చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వమని సంచలన ప్రకటన చేశారు. ఆయనే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala: తిరుమలలో తెలంగాణపై వివక్ష? మరో వివాదానికి తెరలేపిన చంద్రబాబు?


తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శనం చేసుకున్న ఆయన ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌తో కలిసి తిరుమల దర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహబూబ్‌నగర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అవే విషయాలను మాట్లాడుతూ ఈసారి మరింత రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే చంద్రబాబు తిరుమలలో తెలంగాణకు అవకాశం ఇవ్వరా? అని నిలదీశారు.

Also Read: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్‌


'తెలంగాణ ఎమ్మెల్యేల  సిఫారసు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతించేలా అసెంబ్లీలో మాట్లాడుతా' అని అనిరుధ్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబునాయుడు మాట వినేలా ఒత్తిడి తీసుకువస్తామని ప్రకటించారు. 'తెలంగాణలో ఆస్తులు కావాలంటారు కాని తిరుమల వెంకన్న దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు చెల్లవా' అంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా అందరూ ఎమ్మెల్యేలు కలిసి సిఫారసు లేఖల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. కాగా తిరుమల లేఖల అంశంపై రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 


అంతకుముందు మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ కొత్త చైర్మన్‌గా లక్ష్మణ్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన ప్రసంగంలో అనిరుధ్‌తోపాటు  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో సిఫారసు లేఖలు చెల్లకపోవడంపై అనిరుధ్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఇంతటితో వదిలిపెట్టేట్టు కనిపించడం లేదు. ఎలాగైనా సిఫారసు లేఖలు చెల్లుబాటయ్యేలా పోరాటం చేసేటట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయనకు మరో ఎమ్మెల్యే జతకట్టడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుమల విషయమై స్పందించడంతో తెలుగు రాష్ట్రాల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter