తెలంగాణలో కొలువులకై కొట్లాట
తెలంగాణ సర్కారు ఎన్ని అవాంతరాలు కల్పించినా డిసెంబరు 4,5 తేదీల్లో హైదరాబాద్ ప్రాంతంలో "కొలువులకై కొట్లాట" పేరుతో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు, ఉద్యోగ సంఘాలకు ఈ విషయమై పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ రోజు ఇదే విషయమై హన్మకొండలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా, ఆ సభకు హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ఈసారి ఈ సభను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయరాదని చెప్పారు.
తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లక్ష ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగాల ప్రసక్తి తెలంగాణలో పూర్తిగా తొలిగించాలని.. పర్మినెంటు ఉద్యోగాలు తెలంగాణ యువతకు కల్పించి ప్రభుత్వం తమ నిజాయితీని చాటుకోవాలని ఆయన తెలియజేశారు. అందుకే కోసం భారీ ఎత్తున యువతన వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు