Priyanka Gandhi Speech: హైదరాబాద్: తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ‘ జైబోలో తెలంగాణ’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మిత్రులారా అంటూ తెలుగులో మాట్లాడారు. శ్రీకాంతా చారి గురించి ప్రస్తావించారు. ‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏ ఒక్కరో పోరాడితే తెలంగాణ రాలేదు.  తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. బలిదానాలు వృథా కాకూడదని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి” అని ప్రియాంక గాంధీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు అని అమె అన్నారు. కానీ వచ్చిన రాష్ట్రంలో నిధులు, నీళ్లు,  నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితం అయ్యాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావించాం. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? అని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. 


2018 ఎన్నికల్లో రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, పేపర్‌ లీక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, యూనివర్సిటీలలో ఖాళీలను భర్తీ చేయలేదు. ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ చేరేవారి సంఖ్య తగ్గింది. బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు తగ్గించారని ధ్వజమెత్తారు. ప్రతి వ్యక్తిపై రూ.వేల అప్పులు మోపారని, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తామని ప్రియాంకగాంధీ ప్రకటించారు.


తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 
“దేశంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ చేసిన పనులను పేర్లు మార్చి తమవిగా చెప్పుకుంటున్నారు. 


ఇది కూడా చదవండి : KTR satires on Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ హైదరాబాద్ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు


నన్ను మరో ఇందిర అంటారు. అలా అన్నప్పుడు నా బాధ్యత తెలుస్తుంది. 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేనన్నారు. నిజాయితీగా మాట్లాడుతున్నానని .... పూర్తి బాధ్యతతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చలేకపోతే మా సర్కార్ను కూల్చేయండి. ఈ సభా వేదికపై ఉన్న నేతలంతా ఈ డిక్లరేషన్ను అమలు చేస్తారు” అని ప్రియాంక గాంధీ ప్రకటించారు. తెలంగాణను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. త్వరలో తెలంగాణలో  ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.  ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని... ఆ చైతన్యంతోనే కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రియాంకా గాంధీ తెలంగాణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy Election Promises: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు, 10 లక్షలు వడ్డీ లేని రుణాలు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఇంకా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK