Priyanka Gandhi: ప్రియాంక గాంధీ సభకు భారీగా పోటెత్తిన జనం.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో ఆరు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ఉధృతిని మరింత పెంచాయి. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార సభలతో బిజీగా ఉన్నారు. కల్బుర్గిలో ఆమె సభకు భారీ జనం పోటేత్తారు.
 

1 /5

కర్ణాటక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టదలతో ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు బలంగా సంకేతాలు పంపించొచ్చని భావిస్తోంది.

2 /5

గత ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది తాత్కలికంగానే నిలిచింది. అందుకే ఈసారి సంపూర్ణ మెజారిటీ సాధించాలని చూస్తోంది.  

3 /5

బీజేపీ నుంచి కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని మరింత బలంగా ప్రచారం రంగంలో దూసుకెళుతోంది.    

4 /5

ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్‌ కనిపించింది. దారి పొడవునా ఆమెకు ఘన స్వాగతం పలికారు.  

5 /5

తన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు ప్రియాంక గాంధీ. ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పి.. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x