N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఉన్నదెవరు, కోమటిరెడ్డి ఫిర్యాదే కారణమా, ఇంకేమైనా ఉందా
N Convention Demolition: ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా ఎవరూ ముట్టుకోని ఈ కట్టడాన్ని ఆగమేఘాలపై కూల్చడం వెనుక ఏం జరిగింది, ఎవరు కారణమనే చర్య నడుస్తోంది ఇప్పుడు. పూర్తి వివరాలు మీ కోసం.
N Convention Demolition: వివాదాస్పద ఎన్ కన్వెస్షన్ కూల్చివేతపై విభిన్న వాదనలు విన్పిస్తున్నాయి. హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం భారీ క్రేన్లతో ఈ కట్టడాన్ని కూల్చివేయడంపై మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. అక్రమ కట్టడాల్ని కూల్చేయాల్సిందేనని కొందరంటుంటే..రామోజీ ఫిల్మ్ సిటీ జోలికి వెళ్లగలరా అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఏమన్నా ఎన్ కన్వెన్షన్ వెనుక ఎవరున్నారనే చర్చ మాత్రం గట్టిగానే సాగుతోంది
ఎన్ కన్వెన్షన్ కూల్చేందుకు హైడ్రా అధికారులు రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేసుకుని ఉదయమే అక్కడికి చేరుకున్నారు. కేవలం 3 గంటల్లో పని కానిచ్చేశారు. అయితే అది అక్రమ కట్టడం అని అందరికీ తెలిసిందే అయినా ఇంతకాలం ఎవరూ చేయలేనిది ఇప్పుడే ఎందుకనే ప్రశ్న విన్పిస్తోంది. ఈ కూల్చివేత వెనుక మంత్రి కోమటిరెట్టి వెంకటరెడ్డి హస్తముందని సమాచారం. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌కు మూడు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ లేఖ రాశారు. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆధారాలతో సహా లేఖ ద్వారా మంత్రి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమీషనర్ వివిధ శాఖల్నించి సమాచారం రప్పించుకుని పరిశీలించారు. ఇందులో మూడున్నర ఎకరాలు ఆక్రమణ అని తేలింది. దాంతో ఆగమేఘాలపై ఈ నిర్మాణం కూల్చాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే ఆలస్యం అవతలి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయమే భారీ క్రేన్లతో చేరుకుని కూల్చివేత పూర్తి చేశారు. కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా కూల్చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పాత వీడియోలు బయటికొస్తున్నాయి. ఆయన గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ ఎందుకు కూల్చడం లేదంటూ ప్రశ్నించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే అదనుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖను ఆధారం చేసుకుని కూల్చివేత పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
[[{"fid":"359039","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మొత్తానికి ప్రముఖ సెలెబ్రిటీ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందా లేక ఎన్ కన్వెన్షన్‌తో ఆగిపోతుందా అనేది తేలాల్సి ఉంది.
Also read: Netflix OTT Free: ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఫ్రీ, ఆఫర్ కొద్దిరోజులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook