All Exams in Telangana are Postponed till Dassehra | తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితలను గమనించి అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ( Sabitha Indra Reddy) ప్రకటించారు. దసరా వేడుకలు ముగిసే వరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ట్వీట్ చేసి సమాచారం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



పరీక్షలతో పాటు యూజీ, పీడి, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్ ( Hyderabad )లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఉస్మానియా యూనివర్సిటీతో సహా కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలను వాయిదా వేశాయి. 




జవహార్ లాల్ నేషనల్ టెక్నికల్ యూనివర్సిటీ ( JNTU), కాకతీయ విశ్వవిద్యాలయంలో ( Kakatiya University ) జరగాల్సిన ఎంబిఏ, డిగ్రీ సెమిస్టర్స్, బీఈడి తదితర పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఆ నెల 19న, 20న జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే వాయిదాపడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామో అనేది త్వరలో ప్రకటిస్తామని సబితా రెడ్డి తెలిపారు.