GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికలకు భారీగా పోలీసు బలగాలు
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమౌతోంది. కీలకమైన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ ఎన్నికల్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు భారీగా భద్రత ఏర్పాటవుతోంది.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమౌతోంది. కీలకమైన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ ఎన్నికల్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు భారీగా భద్రత ఏర్పాటవుతోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ( Greater Elections ) ఇక మిగిలింది తుది దశ పోలింగ్ మాత్రమే. వారం రోజులకు పైగా సాగిన ప్రచారపర్వంలో పార్టీలు నువ్వా నేనా రీతిలో ప్రచారం సాగించాయి. ఒకరిపై మరొకరి విమర్శలు, దూషణలతో గ్రేటర్ సమరం మినీ అసెంబ్లీ ఎన్నికల్ని తలపించింది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ సాగింది. బీజేపీ ( BJP )తరపున కేంద్రమంత్రులు ప్రచారం నిర్వహించగా..టీఆర్ఎస్ ( TRS )తరపున కేటీఆర్ (KTR) బాధ్యత వహించారు. అటు పాతబస్తీలో పట్టు నిలుపుకునేందుకు మజ్లిస్ పార్టీ తరపున అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin owaisi ), అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రయత్నించారు.
డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 150 డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ పరిధిలో 84, సైబరాబాద్ పరిధిలో 38, రాచకొండ పరిధిలో 28 డివిజన్లకు కలిపి 4 వేల 979 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా..అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల్ని మొహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇక గ్రేటర్ పరిధిలో మొత్తం 50 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. 1 వేయి 704 సమస్యాత్మక ప్రాంతాలు, 1 వేయి 85 అతి సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించారు. ముందుజాగ్రత్త చర్యగా ఇప్పటివరకూ 15 వందల మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా 3 వేల 744 వెపన్స్ డిపాజిట్ చేశారు.
జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారీగా ఇంచార్జ్ ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై ఇప్పటివరకూ 55 కేసులు నమోదయ్యాయి. పలు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవి మానిటరింగ్ టీమ్స్, కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. Also read: GHMC Elections 2020: అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్