Revanth Reddy Failures: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేవంత్‌ రెడ్డి నిర్వహిస్తున్న సంబరాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుండగా.. తాజాగా బీజేపీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సంబరాలు కాదని వంచనోత్సవాలుగా పేర్కొంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై విజయోత్సవాలు కాదు వంచనోత్సవాలుగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్ణించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Street Dog: ముఖ్యమంత్రి, మంత్రులను భయపెట్టిన 'కుక్క'... హెలికాప్టర్‌ ఆలస్యం?


 


'అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు?' అని ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి నిలదీశారు. రాష్ట్రం అప్పులపాలవ్వవడానికి కారణం రేవంత్ రెడ్డి తీరే అని చెప్పారు. విజయోత్సవాల్లో చెప్పుకోవడానికి ఏమీ లేక విపక్షాలపై విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రధాని మోడీ పేరు పలికేందుకు కూడా రేవంత్ రెడ్డికి అర్హత లేదని స్పష్టం చేశారు. పదవి కోసం ప్రసన్నం చేసుకోవడానికే రేవంత్ సోనియా కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకుంటానుంటున్నాడని వివరించారు. రాహుల్ గాంధీ కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతోనే రేవంత్‌ భజన చేస్తున్నాడని చెప్పారు.


Also Read: Currency Showering: అతిథులకు మర్యాద అంటే ఇది.. పెళ్లికి వచ్చిన వారిపై కురిసిన నోట్ల వర్షం


 


'కాంగ్రెస్ పార్టీలో చేరకముందు సోనియాను బలి దేవత అన్న వ్యక్తి ఇప్పుడు ఆమె కాళ్ల నీరు చల్లుకుంటానని అంటున్నారు. ఇంత చంచల వ్యక్తిని ఎక్కడా చూడలేదు' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. 'సోనియా, రాహుల్ ఎవరి కాళ్లు కడిగి నీళ్లు చల్లుకుంటావో నీ ఇష్టం. కానీ మోడీపై విమర్శలు చేస్తే ఖబడ్దార్' అని హెచ్చరించారు. 'టీడీపీలో ఉన్న సమయంలో నువ్వు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించావు. ఆ అంశాన్ని మరిచావా?' అని గుర్తుచేశారు.


'11 నెలల్లో సాధించింది ఏంటో చెప్పండి రేవంత్‌?' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్‌ విసిరారు. అదే 11 నెలల్లో రాష్ట్రం ఎలా నష్టపోయిందో తాము చెబుతామని ప్రకటించారు. అసమర్థ ముఖ్యమంత్రిగా విజయోత్సవాలు చేస్తావా? అని ప్రశ్నించారు. 'ఇచ్చిన హామీలు మరిచి ఎనుముల నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మిగిలావు. విజయోత్సవాలు కాకుండా ఎగవేతల ఉత్సవాలు చేసుకో' అని సూచించారు. మోసం చేశామని చెప్పడానికి విజయోత్సవాలు చేస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.


'లగచర్లలో గిరిజన బిడ్డలపై జరిగిన దాడులు, భూములు లాక్కోవడం ప్రజలకు తెలియదా? ఎక్కడికో ఎందుకు, రేవంత్ నీ అసెంబ్లీ సెగ్మెంట్‌కే పోదాం పదా. నీకు దమ్ముంటే, రాజీనామా చేసి మళ్లీ కొడంగల్ నుంచి పోటీ చెయ్. నీకు కనీసం నీ సెగ్మెంట్లో ఓట్లు పడే అవకాశం లేదు' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్‌ విసిరారు.  'ఏడాది తుగ్లక్ పాలన కొనసాగించినందుకా ఉత్సవాలు? సెటిల్‌మెంట్ కోసమేనా విజయోత్సవాలు? నిరుద్యోగులు, రైతులు, వృద్దులు, మహిళల వద్దకు వెళ్లి ఉత్సవాలు జరుపుకునే దమ్ముందా?' అని రేవంత్‌ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter