Chief Minister Helicopter: కట్టుదిట్టమైన భద్రత కలిగిన ముఖ్యమంత్రి పర్యటనలో ఒక శునకం ప్రవేశించి అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. టేకాఫ్‌కు సిద్ధమైన హెలికాప్టర్ వద్దకు రావడంతో సీఎంతోపాటు మంత్రులు భయాందోళన చెందిన సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ప్రవేశించిన కుక్క బెంబేలెత్తించింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Currency Showering: అతిథులకు మర్యాద అంటే ఇది.. పెళ్లికి వచ్చిన వారిపై కురిసిన నోట్ల వర్షం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలువుదీరిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు సభా వేదిక సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు కొందరు నాయకులు హెలికాప్టర్ ఎక్కారు.
Also Read: Vizag: 'వచ్చి కోరిక తీరుస్తావా.. వీడియోలు బయటపెట్టాలా?'.. లా విద్యార్థిపై నలుగురు గ్యాంగ్ రేప్
టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడకు ఓ కుక్క వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది భయాందోళన చెందారు. ఎంతకీ అక్కడి నుంచి ఆ శునకం కదలలేదు. దీంతో భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టింది. ఎక్కడ హెలికాప్టర్ వద్ద హల్‌చల్ చేస్తుందేమోనని భయాందోళన చెందారు. హెలికాప్టర్ గాల్లోకి లేచేందుకు సిద్ధమైన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో అందులో ఉన్న సీఎం, మంత్రులు కూడా కొంత ఆందోళన చెందారు.
అక్కడకు వచ్చిన కుక్కను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఎక్కడ హెలికాప్టర్ వద్దకు వెళ్తుందోనని భయపడ్డారు. కొద్దిసేపటికి ఆ కుక్క అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని నిమిషాల పాటు కుక్క భయపెట్టడంతో ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుక్కకు భయపడ్డ ముఖ్యమంత్రి, మంత్రులు అంటూ నెటిజన్లు ఆట ఆడుకుంటున్నారు. కొందరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. రేవంత్, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మాత్రం భయాందోళన వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న దయతో గండం గట్టెక్కారని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter