మెట్రో రైలు మళ్లీ పట్టాలెక్కేనా..?
`కరోనా వైరస్` కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 తర్వాత లాక్ డౌన్ 4.0 కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎలా అనే విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
'కరోనా వైరస్' కారణంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. మే 17 తర్వాత లాక్ డౌన్ 4.0 కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ ఎలా అనే విషయంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు తిరిగి పట్టాలెక్కుతుందా..? అనే చర్చ మొదలైంది. ఐతే హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు గ్రేటర్ వాసులకు త్వరలోనే శుభవార్త మోసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు పాటిస్తూనే హైదరాబాద్ మెట్రోను 50 శాతం ప్రయాణీకులతో నడిపేందుకు హెచ్ఎంఆర్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే నెల నుంచి మెట్రో రైలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మెట్రో అధికారులు.
'కరోనా వైరస్'కు వ్యాక్సిన్ వచ్చే వరకు 50 శాతం ప్రయాణీకులతో మెట్రో రైలు నడిపించాలని హెచ్ఎంఆర్ ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉంది. గతంలో ప్రతి స్టేషన్ లోనూ రైలు ఆగేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో తిరిగి ప్రారంభమైన తర్వాత.. ప్రతి స్టేషన్ లో ఆగే పరిస్థితి ఉండదు. అంటే రద్దీ లేని స్టేషన్లలో రైలు ఆగకుండా వెళ్లిపోతుందన్నమాట. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు.
మెట్రో ప్రయాణానికి ఇవీ నిబంధనలు..
హైదరాబాద్ లో ప్రస్తుతం 69 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు అందుబాటులో ఉంది. ఇప్పటికే ప్రయాణీకుల సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ లాక్ డౌన్ అమలు చేయడంతో రోజూ కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకుంటోంది. మరోవైపు రైలు తిరిగి ప్రారంభమైతే.. కచ్చితంగా ప్రయాణీకులు సామాజిక దూరం పాటించేలా మెట్రో సిబ్బంది చర్యలు తీసుకోనున్నారు. పరిమిత సంఖ్యలో మెట్రో రైలులోకి ప్రయాణీకులను అనుమతించనున్నారు. మెట్రో రైలులోనూ తెల్లరంగుతో సర్కిళ్లు గీసి ప్రయాణీకులు నిలబడేందుకు వీలు కల్పించే అవకాశం ఉంది. మెట్రో రైలు ఎక్కే ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని నిబంధన విధించనున్నారు. మరోవైపు ప్రతి ప్రయాణీకునికి రైలు ఎక్కే ముందు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..