February 29 Wedding: ఫిబ్రవరి 29 ..పెళ్లైన వారం రోజులకే నవ దంపతుల దుర్మరణం!
Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. వీరిలో నవదంపతులు కూడా ఉన్నారు.
Hyderabad Alwal Newly Married Couple Died: ఎన్నోఆశలతో కొత్తగా పెళ్లి చేసుకున్నారు. అందరికి గుర్తుండిపోయేలా ఫిబ్రవరి 29 న బాలకిరణ్, నవ్యలు గుంటూరు జిల్లా తెనాలిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వేడుక కూడా గ్రాండ్ గా జరిగింది. బంధువులు, స్నేహితులతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. పెళ్లి వేడుక తర్వాత.. రెండు రోజుల క్రితమే షామిర్ పేటలో రిసెప్షన్ వేడుక కూడా ఘనంగా జరిగింది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కుటుంబంతో సహా వెళ్లారు. స్వామి వారి దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా ఎవరు ఊహించని ఘటన జరిగింది.
Read More:
నంద్యాల జిల్లా నుంచి వస్తుండగా.. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే కుటుంబమంతా మృత్యువాత పడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వారిలో.. అల్వాల్ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు మృతిచెందినట్లు తెలుస్తోంది.
పెళ్లి వేడుక జరిగిన కొన్నిరోజులకే ఇలాంటి ఘటన జరగటంతో ఇరుకుటుంబాలలో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరికి గుర్తుండిపోయేలా ఫిబ్రవరి 29 న పెళ్లిజరిగిందని ఎంతో సంబర పడ్డారని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కూడా కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook