BRS Party MLA: బీఆర్ఎస్ పార్టీలోకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే? కీలక పరిణామంతో కన్ఫార్మ్

Gudem Mahipal Reddy Ready Rejoins Into BRS Party: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతుండగా వారి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దానికి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gudem Mahipal Reddy Back Step: తెలంగాణలో భారీ రాజకీయ పరిణామాలు జరుగుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలల్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం.. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక పార్టీ ఫిరాయించినా పదవులు రాకపోవడం.. ప్రాజెక్టులు.. కాంట్రాక్టులు ఇవ్వకపోవడంతో ఫిరాయించిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అలాంటి వారిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడంతో అతడు ఘర్ వాపసీ ఖాయమని స్పష్టమవుతోంది.
Also Read: Free Bus Scheme: మహిళలకు భారీ షాక్.. తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ బస్సు బంద్?
ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లి గుండెపోటుకు గురయిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి హైదరాబాద్ చేరారు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పద్మారావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. స్టంట్ వేసుకోవడంతో ఆరోగ్యం మెరుగైన విషయాన్ని తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ లో ఏం జరిగింది అని పద్మారావును అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలోనే కొన్ని రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.
Also Read: Rythu Bharosa: రైతులకు భారీ శుభవార్త.. బ్యాంకుల్లో రూ.569 కోట్లు పెట్టుబడి సహాయం జమ
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాట శ్రీనివాస్ అనుచరులు చేసిన దాడి విషయాన్ని మహిపాల్ రెడ్డిని పద్మారావు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పటాన్ చెరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఖాయమనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.