SI Physical Harassment: హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు కీచకపర్వం మరకవముందే రాష్ట్రంలో మరో కీచక ఖాకీ ఉదంతం వెలుగుచూసింది. ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఓ యువతి ఆరోపిస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆ యువతి దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో పోలీస్ శాఖలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్ నేపథ్యంలో ఆ యువతి అందుకు ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. యువతికి ఫోన్ చేసిన సదరు ఎస్సై ఉచితంగా పుస్తకాలు ఇప్పిస్తామని, ఉద్యోగం కూడా వచ్చేలా చేస్తామని చెప్పి పోలీస్ స్టేషన్‌కి పిలిపించినట్లు సమాచారం. తీరా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాక యువతి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. 


ఎస్సై తీరుతో షాక్ తిన్న ఆ యువతి.. విషయాన్ని తమ బంధువులతో చెప్పింది. ఎస్సై అసభ్య ప్రవర్తనపై ఆ యువతి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. సదరు ఎస్సైపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. 


కాగా, రాష్ట్రంలో ఖాకీల లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు వనస్థలిపురంకి చెందిన ఓ వివాహితను రివాల్వర్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఆ వివాహితపై కన్నేసిన అతను.. ఆమె భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు. రివాల్వర్‌తో బెదిరించి రేప్ చేశాడు. 


అప్పటికే ఆమె తన భర్తకు సమాచారమివ్వడంతో అతను ఇంటికి చేరుకుని సీఐపై దాడికి యత్నించాడు. కానీ సీఐ రివాల్వర్‌తో ఇద్దరినీ బెదిరించి తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో కారు ప్రమాదానికి గురవడంతో ఆ ఇద్దరు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నాగేశ్వరరావును సోమవారం (జూలై 11) రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్ఐ విజయ్ కుమార్ కూడా ఓ యువతిపై లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఎస్సై లైంగిక వేధింపులు వెలుగుచూడటంతో ఖాకీల కీచకపర్వం హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: Horoscope Today July 12th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది..


Also Read: Telangana Rain Updates: ఆగని వాన... ఆ 21 జిల్లాల్లో ఇవాళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్... 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook