CI Nageshwer Rao: వనస్థలిపురంలో అర్ధరాత్రి మహిళ ఇంటికి వెళ్లి... ఆమెను తుపాకీతో బెదిరింది అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావు కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఘటన జరిగి రెండు రోజులైనా ఇంకా నాగేశ్వరరావును పోలీసులు పట్టుకోలేదు. ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరాయ్యాడు. తనపై ఫిర్యాదు వచ్చిన రోజున నాగేశ్వరరావును వనస్థలిపురం పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అయితే తాను నైట్ డ్యూటీలో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని.. ఉదయం వస్తానని పోలీసులు చెప్పి... ఆ మేరకు లేఖ రాసి వెళ్లాడు. అర్ధరాత్రి 12 తర్వాత మొబైల్ స్విచాఫ్ చేసుకుని పరారయ్యాడు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసు నమోదైనా ఎందుకు అదుపులోనికి తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
సీఐ నాగేశ్వరరావు విషయంలో రాజకయ రచ్చ సాగుతోంది. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ డీసీపీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. కీచక సీఐని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఐ నాగేశ్వరరావు కీలకపర్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళను తుపాకీతో బెదిరింది రేప్ చేసిన సీఐ నాగేశ్వరరావుకి సీఎం కేసీఆర్ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్లు చేశారు. బంజారాహిల్స్ రాడిసన్ డ్రగ్స్ దందా కేసు వివరాలన్ని నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాయన్నారు. యువరాజు చిట్టా కూడా అందులోనే ఉందన్నారు రేవంత్ రెడ్డి. అత్యాచారం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బాధిత మహిళపై వ్యభిచారం కేసు పెట్టే కుట్ర జరుగుతుందన్నారు. బాధిత మహిళ భర్తపై బ్లాక్ మెయిలింగ్ కేసు పెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
కీచక సీఐ అక్రమాలు ఒక్కొకక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. బంజారాహిల్స్ లో సీఐగా పని చేస్తున్న సమయంలో ఓ ల్యాండ్ వివాదంలో నాగేశ్వరరావు తనను బ్లాక్ మెయిల్ చేశాడని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆరోపించారు. తాను ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు కోట్లాది రుపాయలు ఇచ్చానని.. తనకు కూడా అంత మొత్తం ఇస్తేనే కేసులో నుంచి పేరు తీసేస్తానని చెప్పాడని తెలిపారు. ఓ కేసు విషయంలో బీఎండబ్ల్యూ కారును సీజ్ చేసిన నాగేశ్వరరావు... దానిని తన ఆధీనంలోనే ఉంచుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. కారు యజమాని ఎన్ని సార్లు తిరిగినా తిరిగి ఇవ్వలేదని.. సీఐ వాడుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!
Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook