Another twist in the Telangana Nalgonda Williams‌ case: నిత్య పెళ్లికొడుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండకు చెందిన తలకొప్పుల విలియమ్స్‌ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. విలియమ్స్‌ (Williams‌) ను పెళ్లి చేసుకున్న మహిళ న్యాయం చేయాలని నల్లగొండ (Nalgonda ) ఎస్పీ రంగనాథ్‌కు (SP Ranganath‌) మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల విలియమ్స్‌ను వివాహం చేసుకున్న మునుగోడుకు చెందిన బొల్లం వెంకన్న –సైదమ్మల కుమార్తె శ్రీలత, (Srilatha) ఆమె తల్లిదండ్రులు తాజాగా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అయితే శ్రీలత విలియమ్స్‌ అమాయకుడని అతన్ని విడిచిపెట్టాలని ఎస్పీని వేడుకున్నట్లు తెలిసింది. కాగా శ్రీలత తల్లిదండ్రులు ఎస్పీని కలిసి తమ బిడ్డను విలియమ్స్‌ మోసగించి పెళ్లి చేసుకున్నాడని మొరపెట్టుకున్నారు. అలాగే తమ కూతురు మైనారిటీ (Minority) కూడా తీరలేదని ఆవేదన చెందరాని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత తమ కూతురుని తమ వెంట తీసుకెళ్తామని బతిమిలాడారని తెలిసింది. అందుకు శ్రీలత తాను మేజర్‌నని, విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నానని అతడితోనే ఉంటానంటూ తెగేసి చెప్పిందట. కాగా, అందరి వాదనలు విన్న తర్వాత చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంగనాథ్‌ (SP Ranganath‌) స్పష్టం చేసినట్లు సమాచారం.


కాగా తనతో విలియమ్స్‌ సహజీవనం సాగించి అందరికీ భార్యగా పరిచయం చేసి మోసగించాడని నల్లగొండ బీటీఎస్‌కు (Nallagonda BTS‌) చెందిన తనూజ ఇప్పటికే పోలీసులతో (police) పాటు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇటీవల వివాహం చేసుకున్న మరో యువతి శ్రీలత (Srilatha) ఇలా ఎస్పీని ఆశ్రయించింది.


Also Read : Malaika Arora Gallery: బాలీవుడ్ హాట్ క్వీన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్
కాగా చర్చికి (Church) వస్తున్న మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని నల్గొండకు చెందిన విలియమ్స్‌పై పోలీసులకు ఇటీవల ఫిర్యాదు అందింది. తనను మోసం చేశాడని, మరో 19మంది మహిళలు (19 women) ఆయన ఉచ్చులో చిక్కుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చిలో పియానో వాయించే విలియమ్స్‌ అక్కడికి వచ్చే మహిళలను మాయమాటలతో లొంగదీసుకున్నాడని ఈ నెల 5న ఫిర్యాదు అందినట్టు పోలీసులు (Police) కూడా తెలిపారు.


Also Read : Kangana Ranaut Marriage: ప్రేమలో పడిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. త్వరలోనే పెళ్లి కబురు చెప్పనున్న కంగన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook