TRS VS YSRCP: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు. ఇది ఇప్పటివరకు ఉన్న టాక్. 2019 ఎన్నికల సమయంలో జగన్ కోసం ఓపెన్ గానే ప్రచారం చేశారు సీఎం కేసీఆర్. తర్వాత ఏపీ అసెంబ్లీలోనే కేసీఆర్ కు సెల్యూట్ చేశారు జగన్. ప్రగతి భవన్ కు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా జగన్ తనకు అత్యంత సన్నిహితుడని పలు సార్లు చెప్పారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య మంచి బంధం ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్లపై రచ్చ జరుగుతోంది. వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు ఆయనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు కేసీఆర్ ను పొగుడుతూ జగన్ ను విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ ఫ్లెక్సీలో  ఎన్టీఆర్ ఫోటో ప్రత్యక్షం కావడం ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోయాయనే టాక్ వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగులు, టీచర్లు, విద్యుత్ మీటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఏపీలో టీచర్లపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. కేసీఆర్ సర్కార్ ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. హరీష్ చేసిన ఈ కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు సీఎం జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ల సమస్యలు వాళ్లు చూసుకోకుండా తమపై కామెంట్ చేయడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఓ గ్యాంగ్ తయారైందని, ఈ గ్యాంగ్ ఎజెండాను పోలినట్లుగానే సడెన్‌గా హరీష్ రావు మాట్లాడటం అనుమానంగా ఉందన్నారు. మా సీఎంపై విమర్శలు చేస్తే మేము కేసీఆర్ పై కౌంటర్ ఇస్తే హరీష్ రావు హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని సజ్జల ఎద్దేవా చేశారు. హరీష్ రావుకు, కేసీఆర్ కు  గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ.. ఏపీపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి అమన్మాథ్ మండిపడ్డారు.ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.  కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదన్నారు మంత్రి అమర్నాథ్.


మంత్రి హరీష్ రావుపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్న సమయంలోనే మరో కీలక పరిణామం జరిగింది. రైతుల మోటార్లకు కరెంట్ మీటర్ల విషయంలో మాట్లాడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. కేసీఆర్ రైతుల కోసం మోటార్ల విషయంలో కేంద్రంతో పోరాడుతుంటే.. జగన్ సరెండర్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ను చూసి నేర్చుకో జగన్ అంటూ సలహా ఇచ్చారు. వైసీపీ మంత్రులు హరీష్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న వేళ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిని పొగడటం చర్చగా మారింది. ఇదిలా ఉండగానే ఖమ్మం జిల్లాలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. టీఆర్ఎస్ మద్దతుదారుల గ్రూప్ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఖానాపూర్ గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటో దర్శనమిచ్చింది.


తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన యోధులు అంటూ ఓ వైపు ఎన్టీఆర్.. మరో వైపు కేసీఆర్ ఫోటోలు పెట్టారు. ఈ ఫ్లెక్సీలో కేసీఆర్, ఎన్టీఆర్ తప్ప మరెవరూ కనిపించరు. "అప్పుడు ఎన్టీఆర్…. ఇప్పుడు కేసీఆర్" అని పోస్టర్ లో రాశారు.జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్న కేసీఆర్ కు విషెష్ చెబుతూ ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అన్న నందమూరి తారకరామారావు ఇలానే ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం గతంలో పోరాడారు. ఇప్పుడు కేసీఆర్ పోరాడుతున్నారని అందులో రాశారు. ఎన్టీఆర్, కేసీఆర్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీఆర్ఎస్ తో పాటు ఏపీలోని టీడీపీ కార్యకర్తలు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు. టీడీపీ అభిమానులు కేసీఆర్ ను కీర్తిస్తూ కామెంట్లు పెడుతున్నారు. దేశ్ కీ నేత కేసీఆర్ అంటు గులాబీ లీడర్ల పోస్టులు పెడుతుండగా.. అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ అంటూ టీడీపీ కేడర్ కామెంట్లు పెడుతోంది.


గతంలో ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ కూతురు భార్య భువనేశ్వరిని అసభ్య పదజాలంతో తిట్టినప్పుడు ఖండిస్తూ ప్రకటనలు చేశారు కొందరు టీఆర్ఎస్ నేతలు. వైసీపీ నేతలు గీచ దాటారన కామెంట్ చేశారు. తాజాగా ఖమ్మంకు చెందిన ఓ వైసీపీ కార్యకర్త నారా బ్రాహ్మణిని దూషిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. అతన్ని పట్టుకుని నడిరోడ్డులో చితక్కొట్టారు టీఆర్ఎస్ కార్యకర్తలు.వరుసగా జరుగుతున్న పరిణామాలతో టీఆర్ఎస్, టీడీపీ దగ్గరవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓట్లను దక్కించుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని అంటున్నారు.


Also Read : Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్


Also Read : Rahul Gandhi Bharath Jodo Yatra: 13 రోజులు.. 359 కిలోమీటర్లు! తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర కుదింపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి