Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్

Prithvi raj : టాలీవుడ్ హీరో, ధర్టీ ఇయర్స్ ఫృధ్వీరాజ్ కు మరో షాక్ తగిలింది. విడాకులు ఇచ్చిన తమ భార్యకు నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని విజయవాడ ప్యామిలీ కోర్టు ఆదేశించింది. సినిమాల్లో అవకాశాల కోసం ఆయన భార్య కుటుంబం నుంచి డబ్బులు తీసుకున్నారు.

Written by - Srisailam | Last Updated : Oct 1, 2022, 10:47 AM IST
  • భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం
  • ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్
  • భార్యను ఇంటి నుంచి గెంటేసిన ఫృథ్వి
 Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్

Prithvi raj :  టాలీవుడ్ హీరో, ధర్టీ ఇయర్స్ ఫృధ్వీరాజ్ కు మరో షాక్ తగిలింది. విడాకులు ఇచ్చిన తమ భార్యకు నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని విజయవాడ ప్యామిలీ కోర్టు ఆదేశించింది. సినిమాల్లో అవకాశాల కోసం ఆయన భార్య కుటుంబం నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆర్థికంగా బాగా స్థిరపడిన తర్వాత సాయం చేసిన భార్యను వదిలేశారు. దాంతో ఆమె విజయవాడ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు నెలకు ఎనిమది లక్షల రూపాయల భరణాన్ని ప్రతీ నెలా పదో తేదీ లోపు భార్యకు ఇవ్వాలని ఫృధ్వీరాజ్ ను ఆదేశించింది.

విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ తో 1984లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత సినిమాల కోసం ఫృథ్వి విజయవాడ నుంచి చెన్నె వెళ్లేవారు. ఆ ఖర్చులన్ని శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులే ఇచ్చారు. అయితే సినిమాల్లో కొంత పేరు సంపాదించాకా పృథ్వి తనను వేధించిడం ప్రారంభించాడని శ్రీలక్ష్మి ఆరోపణ. 2016 ఏప్రిల్ 5న శ్రీలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే తనను ఫృథ్వి వేధించడం వల్లే పుట్టింటికి వెళ్లానని శ్రీలక్ష్మి చెబుతోంది. తర్వాత ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.  తన భర్త సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడని, అతడి నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాలని 2017 జనవరి 10న విజయవాడ ఫ్యామిలీ కోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ వేసింది.శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి..  కేసు వేసినప్పటి నుంచి భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున చెల్లించాలని ఫృథ్విరాజ్ ను ఆదేశించారు. ప్రతినెలా 10వ తేదీలోగా మెయింటెనెన్స్ చెల్లించాలని తీర్పుఇచ్చారు ఇందిరా ప్రియదర్శిని.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా టాలీవుడ్ లో ముద్రపడిన ఫృధ్విరాజ్ తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇండస్ట్రీ పెద్దలను దూషించారు. కొందరిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేశారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో చేరిన గత ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎం జగన్ తనకు మద్దతుగా నిలిచిన ఫృథ్విరాజ్ ను గుర్తించారు. టీటీడీ ఛానల్ ఎస్వీబీసీ చైర్మెన్ గా నియమించారు. అయితే గౌరవప్రదమైన పదవిలో ఉంటూ అసభ్య ప్రవర్తనతో అడ్డంగా దొరికిపోయారు. దీంతో అతన్ని ఆ పదవి నుంచి తప్పించింది జగన్  ప్రభుత్వం. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు  ఫృథ్విరాజ్. కొంత కాలంగా ఆయన జనసేనలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది.

Also Read :  Rahul Gandhi Bharath Jodo Yatra: 13 రోజులు.. 359 కిలోమీటర్లు! తెలంగాణలో రాహుల్ గాంధీ యాత్ర కుదింపు

Also Read :  LPG Cylinder: దసరా పండగ వేళ ఎల్పీజీ వినియోగదారులకు షాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News