KTR DAVOS: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్ వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడుల సదస్సులో తనదైన మార్క్ చూపిస్తున్న కేటీఆర్.. దావోస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. మొదటి రెండు రోజుల్లోనే పలు దిగ్జజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించేలా కేటీఆర్ చర్చలు జరిపారు. పలు కంపెనీలు తెలంగాణలో తమ కార్యాకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటనలు కూడా చేశాయి. దావోస్ లో కేటీఆర్ టీమ్ వర్క్ పై ప్రశంసలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిలికాని వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఎంట్రప్రెన్యూర్‌ అశా జడేజా మోత్వాని తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కేటీఆర్ అద్భుతంగా కృషి చేస్తున్నారని ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ పని తీరు సూపర్ అంటూ కొనియాడారు. దావోస్ లో తెలంగాణ టీమ్ ఫుల్ ఫైర్ తో  ఉందన్నారు. ఫ్యూచర్ లో తెలంగాణ డీల్స్  బిలియన్ డాలర్లు దాటి వెళ్లే అవకాశం ఉందని తన ట్వీట్ లో అశా జడేజా వెల్లడించారు.


 



 



కేటీఆర్ అంతటి  విజన్ ఉన్న యువ పొలిటికల్ లీడన్ ను తానెప్పుడు చూడలేదని అశా జడేజా మోత్వాని కొనియాడారు. అన్ని అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన, స్పష్టత ఉందన్నారు. 20 సంవత్సరాల తర్వాత భారతదేశానికి కేటీఆర్ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో కేటీఆర్ ను కలిసిన ఫోటోలను అశా జడేజా తన పోస్టులో షేర్ చేశారు. కేటీఆర్ భవిష్యత్ దేశ ప్రధాని అయినా అశ్చర్యం లేదంటూ ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, ఎంట్రప్రెన్యూర్‌ అశా జడేజా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ కేడర్..ఆమె ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు.


READ ALSO: Malla Reddy On Revanth Reddy: నేనిచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..


READ ALSO: MLC Ananthababu: హంతకుడిని గారూ అని సంబోధిస్తారా! కాకినాడ ఎస్పీపై జనాల ఫైర్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook