Malla Reddy On Revanth Reddy: నేనిచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Malla Reddy On Revanth Reddy: తెలంగాణలో అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని రోజుల వరకు కారు, కమలం పార్టీలు నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకోగా.. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయ రచ్చ రాజేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 02:44 PM IST
  • రేవంత్ రెడ్డి ఆరోపణలకు మల్లారెడ్డి కౌంటర్
  • రేవంత్ రెడ్డి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు- మల్లారెడ్డి
  • నా డబ్బులతోనే రేవంత్ బిడ్డ పెళ్లి- మల్లారెడ్డి
Malla Reddy On Revanth Reddy: నేనిచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి.. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Malla Reddy On Revanth Reddy: తెలంగాణలో అధికార , విపక్ష నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. కొన్ని రోజుల వరకు కారు, కమలం పార్టీలు నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకోగా.. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయ రచ్చ రాజేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జిల్లాలు తిరుగుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. అదే స్థాయిలో అధికార పార్టీ నేతలు కౌంటరిస్తున్నారు. సోమవారం జరిగిన రచ్చబండలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మరోసారి మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు భూకబ్జాదారులని ఆరోపించారు. పేదలను బెదిరింది తక్కువ రేట్లపై భూములు కొట్టేస్తున్నారని మండిపడ్డారు.

తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిపై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. రేవంత్‌రెడ్డిని బ్లాక్ మెయిలర్ అన్నారు మల్లారెడ్డి. ఆయన నిర్వహించేది రచ్చ బండ రాదు.. బట్టేబాజ్ బండ అన్నారు. కోట్లాది రూపాయలు లంచంగా ఇచ్చి  పీసీసీ పదవిని తెచ్చుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ అని... ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాశనం చేసి బీజేపీలో చేరుతారని అన్నారు. తాను కష్టపడి పైకి వచ్చానన్న మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

టీడీపీలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డితో అనేక కష్టాలు పడ్డానని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్ గిరి టికెట్ కోసం తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి సీటు తనకు రాకుండా అడ్డుకునేదుకు కుట్రలు చేశాడని..  చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పి ఎంపీ సీటు తెచ్చుకుని గెలిచానని మల్లారెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తనను వేధించాడని.. తనతో డీల్ కోసం మధ్యవర్తులను పెట్టారని చెప్పారు. తాను అడిగినంత ఇవ్వకపోతే కాలేజీలు క్లోజ్ చేయిస్తానని రేవంత్ రెడ్డి బెదిరించారని మల్లారెడ్డి తెలిపారు. తాను ఇచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లి చేశారని మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో యాదగిరిగుట్టలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని.. రేవంత్ రెడ్డి సిద్దమేనా అని సవాల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని మల్లారెడ్డి అన్నారు.

READ ALSO: KCR TARGET BJP: బీజేపీకి కేసీఆర్ తొలి దెబ్బ.. బీహార్ సంకీర్ణ కూటమిలో బీటలు! సంచలనం జరగబోతోందా?

READ ALSO: MLC Ananthababu: మావోయిస్టులు హెచ్చరించినా మారలే... మన్యంలో అనంతబాబువి అన్ని అక్రమాలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News