టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆగదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. శుక్రవారం ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కరీంనగర్‌ సభలో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 


ఆర్టీసీ సమస్యను ముఖ్యమంత్రి గారు కార్మిక కోణంలో చూడాలని.. ఒకవేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆటోమేటిక్‌గా ట్రేడ్ యూనియన్‌లు వాటికవే రద్దు అయిపోవడమే కాకుండా చట్టాలు కూడా మారిపోతాయన్నారు.  ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్ల సమస్యే ఉండదని చెబుతూ.. టీజీవోలు, టీఎన్‌జీవోలకు కూడా ఎన్నికలు లేవని అశ్వత్థామ రెడ్డి గుర్తుచేశారు.